Share News

స్కూల్‌ అసిస్టెంట్లకు జేఎల్‌ పదోన్నతి ఎప్పుడో...?

ABN , Publish Date - Aug 25 , 2026 | 10:48 PM

ప్రభుత్వ ఉ న్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఉపాధ్యాయులకు సుమారు 25 ఏళ్లకు పైగా జూనియ ర్‌ లెక్చరర్‌ పదోన్నతులు నిలిచిపోయాయి.

స్కూల్‌ అసిస్టెంట్లకు జేఎల్‌ పదోన్నతి ఎప్పుడో...?

-దశాబ్దాలుగా పెండింగ్‌లో ప్రమోషన్లు

-సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కదలని ప్రక్రియ

-ప్రభుత్వాలు చొరవ తీసుకోవడంలో తాత్సారం

-జిల్లాలో ప్రమోషన్‌కు రెండు వేల మంది అర్హులు

మంచిర్యాల, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉ న్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఉపాధ్యాయులకు సుమారు 25 ఏళ్లకు పైగా జూనియ ర్‌ లెక్చరర్‌ పదోన్నతులు నిలిచిపోయాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పదోన్నతులు లేక ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అలానే మిగిలిపోతున్నారు. గతంలో జూనియర్‌ లెక్చరర్‌ పదోన్నతులు ప్రభు త్వ ఉపాధ్యాయులకే దక్కగా పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయుల ఆం దోళనతో ఎట్టకేలకు జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ని యామకాల్లో జీఓఎంఎస్‌ 66, తేదీ 13-02-1989 ప్రకా రం పంచాయతీరాజ్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులకు జూనియర్‌ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించే వి ధానం ఆరంభమైంది. స్కూల్‌ అసిస్టెంట్లకు 40 శాతం, అర్హత కలిగిన భోదనేతర సిబ్బందికి 10 శాతంతో పా టు నేరుగా మరో 50 శాతం పోస్టులను ప్రభుత్వం రి క్రూట్‌ చేయాల్సి ఉంది. 1998 వరకు స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులకు దఫాల వారీగా పదోన్నతులు కల్పించనప్పటికీ ఆ తరువాత పంచాయతీరాజ్‌, ప్రభుత్వ ఉ పాధ్యాయుల నడుమ ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌లో వివా దం తలెత్తి కోర్టు దాకా వెల్లడంతో ప్రమోషన్‌ల ప్రక్రియకు బ్రేక్‌ పడింది. ఫలితంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కాంట్రాక్ట్‌ పద్ధతులో లెక్చరర్‌ల నియామకానికి తెరలేచింది.

ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ రూపొందిస్తేనే....

ఉపాధ్యాయులందరికీ ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ రూ పొందిస్తే తప్ప స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించే అవకాశం లేదు. డైట్‌ లెక్చరర్‌లు, ఉప విద్యాధికారులు, మండల విద్యాధికారులు, బీఈడీ కళాశాలల అధ్యాపకులతో పాటు జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల్లో 40 శాతం స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులతో భర్తీ చేయాల్సి ఉన్నందున ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ రూపొందించడం తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం రా ష్ట్ర వ్యాప్తంగా కేవలం ఎనిమిది రెగ్యులర్‌ ఎంఈవో పో స్టులు మాత్రమే ఉండటం గమనార్హం. అదే జిల్లా విష యానికి వస్తే పీజీ హెచ్‌ఎంలకే ఎంఈవోలుగా అదన పు బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు హెచ్‌ఎం వి ధులు నిర్వహించడంతోపాటు ఎంఈవోలుగా మండలం లోని స్కూళ్లను విజిట్‌ చేయాల్సి వస్తోంది. ఈ కారణం గా రెండు పోస్టులకు న్యాయం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని చోట్ల పై రెండు పోస్టులకు అ దనంగా స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం పోస్టును కూడా కే టాయించారు. అలా ఒక్కొక్కరు రెండు, మూడేసి పో స్టులను నిర్వహించాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు చొరవ తీసుకుని నిబంధనలకు అనుగుణంగా అర్హులకు పదోన్నతులు కల్పిస్తే పాఠశాలల పర్యవేక్షణ సక్రమంగా జరిగి విద్యా వ్యవస్థ పటిష్టతకు దోహదం చేసినట్లవుతుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రెండు వేల మంది సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్‌లు పదోన్నతులకు అర్హతలు కలిగి ఉన్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌లకు పదోన్నతులు కల్పిస్తే వారి స్థానంలో అర్హత కలిగిన సె కండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు (ఎస్జీటీ) ప్రమోషన్‌ పొం దే వెసులుబాటు ఉంటుంది. ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం మూలంగా ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపడితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సీని యర్‌ అసిస్టెంట్‌లు పదోన్నతులు పొందిన స్థాయిలో మాదిరిగా జీతభత్యాలు అందుకుంటున్నందున ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం కూడా ఉండదు.

నిలిచిన పదోన్నతుల ప్రక్రియ...

పంచాయతీరాజ్‌, ప్రభుత్వ ఉపాధ్యాయులు నడుమ నెలకొన్న వివాదం కారణంగా కోర్టులో కేసు ఉన్నందున పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. అయితే పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులేనని ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ రూపొందించి వారికి కూడా పదోన్నతులను కల్పించాలని 15-02-2015 రోజు న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పంచాయతీరాజ్‌ ఉ పాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ 1982లో ప్రాంతీయేకరణ అయినందున ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా పరిగణించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిం ది. అలాగే పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులను కూడా లోకల్‌ క్యాడర్‌గా ఆర్గనైజ్‌ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభు త్వం, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కూడా తన తీర్పులో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం విధి గా పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులను లోకల్‌ క్యాడర్‌ గా పరిగణిస్తూ 1975 రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సవరణ చేయాలని సూచించింది. దీనికి స్పం దించిన అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల కు ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పలువురు కోర్టును ఆశ్రయిం చడంతో ఆ ప్రక్రియ అంతటితోనే నిలిచిపోయింది.

సర్వీస్‌ రూల్స్‌ వెంటనే అమలు చేయాలి...

పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌

ప్రభుత్వాలు కామన్‌ సర్వీస్‌ రూల్స్‌ వెంటనే చేప ట్టడం ద్వారా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. స్కూ ల్‌ అసిస్టెంట్లు అందరికీ ఎంఈవోలు, జూనియర్‌ లెక్షర ర్లు, డైట్‌ లెక్షరర్లుగా అర్హతలను బట్టి పదోన్నతులు క ల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు ఇ ప్పటికైనా చొరవ తీసుకుంటే విద్యా వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. మా ఉపాధ్యాయ సంఘం నుంచి కూడా అవసరమైన ప్రతీసారి ప్రభుత్వానికి ప్రాతినిథ్యం చేస్తూనే ఉన్నాం.

Updated Date - Aug 25 , 2026 | 10:48 PM