Share News

kumaram bheem asifabad- రాజీవ్‌ యువ వికాసం ఎప్పుడు..?

ABN , Publish Date - Feb 27 , 2026 | 10:12 PM

రాజీవ్‌ యువ వికాసం పథకంలో భాగంగా రాయితీ రుణాల కోసం దరఖాస్తుచేసుకున్న యువత పథకం అమలుకు వేచి చూస్తున్నారు. రాష్ట్ర ప్రభు త్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో రాజీవ్‌ యువ వికాసం పేరిట ఆర్థిక సాయం అందజేసి వారికి అండగా ఉండేందుకు పథకం ప్రకటించింది. కానీ దరఖాస్తులు స్వీకరిం చి ఏడాది గడిచినా అమలుకు నోచుకోక పోవడంతో నిరుద్యోగ యువత నిరాశల చెందుతున్నారు.

kumaram bheem asifabad- రాజీవ్‌ యువ వికాసం ఎప్పుడు..?
లోగో

- ఇంటర్వ్యూలు పూర్తయినా అందని రుణాలు

- జిల్లాలో అన్ని వర్గాల నుంచి 28,116 మంది దరఖాస్తు

చింతలమానేపల్లి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌ యువ వికాసం పథకంలో భాగంగా రాయితీ రుణాల కోసం దరఖాస్తుచేసుకున్న యువత పథకం అమలుకు వేచి చూస్తున్నారు. రాష్ట్ర ప్రభు త్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో రాజీవ్‌ యువ వికాసం పేరిట ఆర్థిక సాయం అందజేసి వారికి అండగా ఉండేందుకు పథకం ప్రకటించింది. కానీ దరఖాస్తులు స్వీకరిం చి ఏడాది గడిచినా అమలుకు నోచుకోక పోవడంతో నిరుద్యోగ యువత నిరాశల చెందుతున్నారు. ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టి యన్‌ వంటి వర్గాల ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హుల ఎంపిక కోసం జిల్లాలోని అన్ని మండ లాల్లో అధికార యంత్రాంగం ఇంటర్వ్యూలు నిర్వహించారు. దీంతో నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తించాయి. కానీ ఏడాది పూర్తైనా ఈ పథకంపై ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం, ఆర్థిక సాయం అందజేయకపోవ డంతో నిరుద్యోగులు, దరఖాస్తు చేసుకున్న అబ్దిదారులకు ఎదురుచూపు లు తప్పడం లేదు. గతేడాది ఏప్రిల్‌ 14వ తేదీ వరకు ధరఖాస్తులు స్వీకరించారు. 28వ తేదీ నుంచి దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల నుంచి పత్రాలు పరిశీలించారు. గతేడాది జూన్‌ 2 తెలంగా ణ ఆవిర్భావం రోజున అర్హులైన వారికి మంజూరు పత్రాలు జారీ చేస్తామని చెప్పి నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి మందడుగు పడలేదు. అర్హులకు సాయం అందలేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లాలోని 15 మండలాల పరిధిలో అన్ని వర్గాల ప్రజల నుంచి 28,116 ధరఖాస్తులు వచ్చా యి. ఇందులో కార్పొరేషన్‌ల వారీగా ఎస్సీ 6,836 మంది, ఎస్సీ 7,233 మంది, బీసీ 12,096 మంది, మైనార్టీ 1,918 మంది, క్రిస్టియన్‌ 33 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ. 50 వేల నుంచి రూ. 4లక్షల వరకు ఆర్థిక సాయం అందజే స్తామని చెప్పారు. జిల్లాలోని రెండు మున్సిపాలిటీ ల్లో పురపాలక కమిషనర్లు, మండలాల్లో ఎంపీడీవో ల అధ్యక్షతన ప్రత్యేక కమిటీల బాధ్యులు ధరఖా స్తులు స్వీకరించారు. వారి ఆధ్వర్యంలో ప్రస్తుతం అన్ని మండలాల్లో ధరఖాస్తులు చేసుకున్న అభ్య ర్థుల నుంచి పత్రాలు పరిశీలించి అర్హులను గుర్తిం చేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉపాధి యూనిట్ల కోసం రుణ మంజూరు అవకాశం కోసం బ్యాంకర్ల సమక్ష్యంలో ఈ పరిశీలన జరిగింది. అర్హులను గుర్తించి అర్హుల జాబితాను జిల్లా కమిటీకి నివేదించారు. జిల్లా కమిటీలో కమిటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ వైస్‌ చైర్మన్‌గా, కన్వీనర్‌గా ఆర్డీవో, సభ్యులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పోరేషన్‌ ఈడీలు, పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా సంక్షేమాధికారి, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ తదితరులుం టారని చెప్పడంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. వీరే తుది అర్హుల జాబితాను ప్రకటి స్తారని చెప్పడంతో అర్హుల్లో ఆశలు రేకెత్తించాయి. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శ కాలు జారీ అవుతాయని అధికారులు చెప్పి ఏడాది గడిచినా ఎలాంటి సాయం అందలేదు.

- యూనిట్ల వారీగా ఇలా..

రాజీవ్‌ యువ వికాసం పథకం లబ్ధిదారులకు యూనిట్ల వారీగా అర్థిక సాయం అందజే సేందుకు యూనిట్‌-1 కింద రూ. 50వేలు దీనికి వంద శాతం రాయితీ, యూనిట్‌-2 కింద రూ. లక్ష వరకు ఇవ్వ నుండగా ఇందులో 90 శాతం సబ్సిడీ, యూనిట్‌-3 కింద రూ. లక్ష నుంచి 2 లక్షల వరకు ఇవ్వనుండగా 80 శాతం సబ్సిడీ, యూనిట్‌-4 కింద రూ. 2లక్షల నుంచి 4 లక్షల వరకు ఇవ్వనుండగా ఇందులో 70 శాతం సబ్సిడీ ఇస్తామని అధికారులు చెప్పారు. అయితే ఈ పథకం కోసం మీసేవా లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారం, దానికి జత చేసిన ఆధార్‌, రేషన్‌ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, విద్యార్హత పత్రం, బ్యాంక్‌ పుస్తకం తీసుకొని అధికారుల వద్దకు ధ్రువ పత్రాల పరిశీలనకు సంబంధిత అభ్యర్థులు హాజరయ్యారు.

- మొదటి విడతే ఆలస్యం..

రాజీవ్‌ యువ వికాసం మొదటి విడతకే మోక్షం లేక పోవడంతో ఇక మిగిలిన వారికి అందే పరిస్థితి లేదని దరఖాస్తుదారులు నిరాశ చెందుతున్నారు. గతేడాది రాష్ట్ర ఆదిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న లబ్ధిదారులకు చెక్కులు అందజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆఖరి నిమిషంలో వాయి దా వేసింది. దీంతో దరఖా స్తు చేసుకున్న నిరు ద్యోగ యువత తీవ్ర నిరాశకు గురయ్యారు. పంచా యతీ ఎన్నికలు నిర్వహిస్తారనే ఉద్దేశ్యంతో అప్పుడు వాయిదా వేసింది. గత డిసెంబరులో ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాతనైనా ఈ పథకం గురించి ప్రభుత్వం ప్రకటన విడుదల చేస్తుందని ఆశించిన నిరుద్యోగ యువతకు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇకనైనా ప్రభు త్వం ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా యువతకు అండగా నిలవాలని కోరుతున్నారు.

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..

- జూమిడి సాగర్‌, డబ్బా గ్రామం

ప్రభుత్వం యువతను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం యువతకు పెట్టుబడి సా యం కింద రుణాలు ఇస్తామనడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతీ, యువకులు దరఖాస్తులు చేసు కున్నారు. ఏడాది గడుస్తున్నా ఈ పథకంపై ప్రభు త్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రభుత్వం యువతను ఆదుకునేందుకు రుణాలు మంజూరు చేయాలి. చా లా మంది ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూ స్తున్నారు.

Updated Date - Feb 27 , 2026 | 10:12 PM