కొత్త ఠాణాల ఏర్పాటు ఎప్పుడో..!
ABN , Publish Date - Apr 06 , 2026 | 10:44 PM
శాంతిభద్ర తల పరిరక్షణను పటిష్టంగా అమలు చేస్తామని చెబు తున్న రాష్ట్ర ప్రభుత్వం...కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, అప్‌గ్రేడేషన్‌పట్ల నిర్లక్ష్యధోరణి అవలంభిస్తోంది.
-అప్‌గ్రేడేషన్‌కూ కలగని మోక్షం
-రెండేళ్ల కిత్రమే జిల్లా నుంచి పలు ప్రతిపాదనలు
-అయినా ప్రభుత్వం నుంచి స్పందన కరువు
-మంచిర్యాలలో 2-టౌన్ పీఎస్ ఏర్పాటయ్యేనా..?
మంచిర్యాల, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్ర తల పరిరక్షణను పటిష్టంగా అమలు చేస్తామని చెబు తున్న రాష్ట్ర ప్రభుత్వం...కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, అప్‌గ్రేడేషన్‌పట్ల నిర్లక్ష్యధోరణి అవలంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పోలీసు స్టేషన్ల ఏర్పాటు, ఉన్న వాటికి అప్‌గ్రేడేషన్ చేయడానికి ప్రభుత్వం రెండేళ్ల క్రితమే పచ్చజెండా ఊపింది. అయినప్పటికీ ఆ ప్రక్రియ ముం దుకు కదలకపోవడంతో శాంతిభద్రతల సమస్య ఎక్క డి గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. రాష్ట్రం లో కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, అప్‌గ్రేడేషన్‌కు ప్రభు త్వం సమాయత్తం కావడంతో జిల్లాకు సంబంధించి అ ధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభు త్వానికి అందజేశారు.
మంచిర్యాలలో 2-టౌన్ ఏర్పాటుకు చర్యలేవీ...?
మంచిర్యాల జిల్లా కేంద్రంలో 2-టౌన్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దాల కాలంగా ఉం ది. టౌన్ పెద్దది కావడం, క్రైం రేట్ కూడా ఎక్కువ ఉండడంతో ఇక్కడ కొంత మేర లా అండ్ ఆర్డర్ సమ స్య తరచుగా తలెత్తుతోంది. మంచిర్యాల పట్టణం టౌన్ -1, టౌన్ -2గా ప్రజలు పిలుపుస్తుంటారు. టౌన్ -1తో సమానంగా టౌన్-2 కూడ శరవేగంగా అభివృద్ధి చెందు తోంది. అభివృద్ధితో పాటు క్రైం రేట్ కూడా అదే రేషి యోలో పెరుగుతుండడంతో టౌన్-2గా పిలువబడే హ మాలీవాడ ప్రాంతం కేంద్రంగా ప్రత్యేకంగా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. దీన్ని దృ ష్టిలో పెట్టుకొని 2024 ఆగస్టులో పోలీసుశాఖ ఉన్నతా ధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. మంచిర్యాల పట్టణంలో ప్రస్తుతం రెండు లక్షలపై చిలుకు జనాభా ఉంది. టౌన్-1, టౌన్-2లో దాదాపుగా సమానంగా లక్ష చొప్పున జనాభా ఉంటుంది. మొత్తం గా రెండు లక్షల జనాభకు సంబంధించి ప్రస్తుతం ఒకే ఒక్క పోలీసు స్టేషన్ ఉండడంతో సమస్యల పరిష్కా రానికి సకాలంలో చర్యలు చేపట్టలేకపోతున్నారు. హ మాలీవాడ కేంద్రంగా మరో పోలీసు స్టేషన్ ఏర్పాటు చేస్తే పరిపాలన సులభతరం అయ్యే అవకాశం ఉం టుంది. ఈ విషయమై పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడ హామీలు ఇచ్చినప్పటికీ సంవ త్సరాలు గడిచిన నెరవేరడం లేదు. టూటౌన్ పోలీసు స్టేషన్ ఏర్పాటు విషయమై స్థానిక ఎమ్మెల్యే ప్రేంసా గర్‌రావు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్ర భుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా...ఇప్పటి వరకు మోక్షం లభించలేదు.
అత్యధిక క్రైం రేట్ నమోదు...
ప్రస్తుతం మంచిర్యాల పట్టణ పోలీసు స్టేషన్ పరి ధిలో ఏడాదికి సగటున క్రైం రేటు వెయ్యి వరకు ఉం టుంది. వ్యాపార కేంద్రం విరాజిల్లుతున్న మంచిర్యాల జిల్లా కేంద్రంగా ఏర్పాటైన నాటి నుంచి దిన దినాభి వృద్ధి చెందుతోంది. పట్టణ పరిసర ప్రాంతాల్లో విరివిగా నివాస గృహాలు వెలుస్తుండగా ప్రజల సంచారం అధి కమైంది. లాడ్జీలు, హోటల్లు, ఆసుపత్రులు పదుల సం ఖ్యలో ఏర్పడగా నిత్యం వివిధ పనుల నిమిత్తం ఇక్క డికి వచ్చిపోయేవారి సంఖ్య కూడా అధికంగా ఉంటోం ది. దీనికి తగ్గట్టుగా క్రైం రేటు కూడా అధికంగా నమో దు అవుతుండడం గమనార్హం. ముఖ్యంగా జిల్లా కేం ద్రం, పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుండగా, అదే స్థాయిలో వివాదాలు చో టు చేసుకుంటున్నాయి. సాధారణంగా ఆరు వందల వరకు క్రైం రేటు ఉంటే ఒక పోలీసు స్టేషన్ పరిధిలో పరిపాలన సులభంగా ఉంటుంది. కాని మంచిర్యాలలో అంతకు రెట్టింపు ఉండడంతో సమస్య తీవ్రంగా ఉంది.
2-టౌన్ ఏర్పాటుతో ప్రజా సమస్యలకు పరిష్కారం...
హమాలీవాడ కేంద్రంగా 2-టౌన్ పోలీసు స్టేషన్ ఏ ర్పాటు చేస్తే ప్రజా సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉ త్తర్వులు వెలువడగానే కార్యచరణ ప్రారంభించేం దుకు పోలీసుశాఖ ఏర్పాట్లు చేస్తోంది. హమాలీవాడలో ప్రత్యేకంగా సీఐ స్థాయిలో పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసే ఆవశ్యకత ఉండగా, ఎస్‌ఐలు, ఏఎఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు తదితర సిబ్బంది మొత్తంగా 55 మంది వరకు ఉండనున్నారు. మంచిర్యాల డివిజ న్‌లో డీ-గ్రేడ్‌తో కూడిన టౌన్-1తో సమానంగా టౌన్-2 పోలీసు స్టేషన్ ఏర్పాటు కావలసిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా జైపూర్ పోలీస్ స్టేషన్ గతంలో శ్రీరాం పూర్ సర్కిల్ పరిధిలో ఉండేది. ఇటీవల జైపూర్ పీఎస్ ను సర్కిల్‌గా అప్‌గ్రేడ్ చేయడంతో శ్రీరాంపూర్ సర్కిల్ పరిధి తగ్గింది. కేవలం శ్రీరాంపూర్‌కే ప్రత్యేకంగా సర్కి ల్ కార్యాలయం ఉండటంతో అంతగా ఉపయోగం లేద నే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీరాంపూర్ పో లీస్ స్టేషన్‌న్‌తోపాటు అక్కడి సిబ్బందిని మంచిర్యాలకు తరలించి, టూ టౌన్ పీఎస్‌గా కొనసాగిస్తార నేప్రచా రమూ జరుగుతోంది.
నస్పూర్ పీఎస్ అప్‌గ్రేడేషన్ కూడా...
నస్పూర్ పోలీసు స్టేషన్‌ను కూడా ఉన్నతీకరించేం దుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అంద జేశారు. నస్పూర్ పరిధిలో కలెక్టరేట్‌తో పాటు జనాభా కూడ అధికంగా ఉండడంతో క్రైం రేట్ కూడ ఎక్కువ మొత్తంలోనే నమోదు అవుతోంది. దీంతో పోలీసు స్టేష న్ అప్‌గ్రేడ్ చేయాలనే నిర్ణయానికి అధికారులు వచ్చా రు. నస్పూర్ పోలీసు స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయడం వల్ల అక్కడి ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కా రం లభించే అవకాశాలు ఉన్నాయి.