kumaram bheem asifabad- కుట్టేదెప్పుడు.. ఇచ్చేదెప్పుడు..
ABN , Publish Date - Jul 22 , 2026 | 10:48 PM
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా అందించే రెండు జతల యానిఫాం పంపిణీ ప్రక్రియ ఈ సారి అస్తవ్యస్తంగా మారింది. కొత్త విద్యా సంవ త్సరం ప్రారంభమై నెలరోజులు అవుతున్నా ఇప్పటి వరకు యూనిఫాం కుట్టే పనులు ప్రారంభం కాలేదు. దీంతో పాత దుస్తులతోనే విద్యార్థులు బడులకు హాజ రవుతున్నారు. ఏటా ఏకరూప దుస్తులు విద్యార్థులకు సకాలంలో అందడంలేదు. జి
- జిల్లాలో 40వేల మంది విద్యార్థులు
- పాత యూనిఫాంతోనే బడులకు హాజరు
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా అందించే రెండు జతల యానిఫాం పంపిణీ ప్రక్రియ ఈ సారి అస్తవ్యస్తంగా మారింది. కొత్త విద్యా సంవ త్సరం ప్రారంభమై నెలరోజులు అవుతున్నా ఇప్పటి వరకు యూనిఫాం కుట్టే పనులు ప్రారంభం కాలేదు. దీంతో పాత దుస్తులతోనే విద్యార్థులు బడులకు హాజ రవుతున్నారు. ఏటా ఏకరూప దుస్తులు విద్యార్థులకు సకాలంలో అందడంలేదు. జిల్లాకు అవసరమైన క్లాత్(వస్త్రం) సుమారు ఐదు లక్షల మీటర్లు. కాగా జిల్లాకు వచ్చింది కేవలం 50వేల మీటర్లు మాత్రమే. జిల్లాలో రెండు మోడల్ స్కూల్స్, 15 కేజీబీవీలు, 60 ఉన్నత పాఠశాలలు, 500 ప్రాథమిక పాఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు మొత్తం 687 ఉన్నాయి. మొత్తం 687 పాఠశాలల్లో 40వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఏకరూప దుస్తుల రంగు, డిజైన్‌లో మార్పులు చేసింది. కొత్తగా ఖరారైన డిజైన్ ఏకరూప దుస్తుల వస్త్రం ప్యాంటు, షర్టులకు గాను పూర్తిస్శాయిలో సరఫరా జరుగకపోవడంతో విద్యార్థులకు ఎప్పుడు అందుతాయో అన్న సందేహం నెలకొంది. ఏటా పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి వస్త్రం సరఫరా, కుట్టు పనులు 50 శాతానికి పైగా జరిగేవి. రెండు నెలల ముందు కొలతలు తీసుకున్నప్పటికి ఫలితం లేకుండా పోయింది.
- అరకొర సరఫరా..
విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టేందుకు వస్త్రం అరకొరగానే సరఫరా చేశారు. మొత్తం విద్యార్థుల యూనిఫాం కోసం సుమారు ఐదు లక్షల మీటర్లు అవసరం. కానీ ఇప్పటికీ జిల్లాలోని కేజీబీవీ విద్యార్థులకు సంబంధించి సుమారు 50వేల మీటర్లు మాత్రమే వచ్చింది. వచ్చిన వస్త్రాన్ని అయా మండలాల ఏపీఎంలకు అందజేసి మహిళా సంఘాల ద్వారా దుస్తులు కుట్టేందుకు చర్యలు చేపడుతు న్నారు. కొన్ని మండలాల్లో రెండు జతల దస్తులు పూర్తి కాగా మరికొన్ని మండలాల్లో ఒక జత మా త్రమే కుట్టడం పూర్తయింది. కాగా జిల్లాలోని అయా మండలాలకు ఇంకా ఏకరూప దుస్తుల వస్త్రం అందలేదు. ప్రభుత్వం నుంచి ఇంకా వస్త్రం సరఫరా చేయకపోవడంతో ఆయా మండలాల్లో పాఠశాల దుస్తులు కుట్టేందుకు మహిళా సంఘాలు ఎదురు చూస్తున్నాయి. విద్యార్థుల కొలతలు మార్చి, ఏప్రిల్ లోనే తీసుకున్నారు. ఈసారి వస్త్రం సరఫరా ఆలస్యం కావడంతో దుస్తులు కుట్టే ప్రక్రియ జిల్లాలోని 15 మండలాల్లో ఇంకా మొదలు కాలేదు.
త్వరలోనే సరఫరా చేస్తాం..
-సచ్చిదానందచారి, డీఈవో
ఏకరూప వస్త్రం పూర్తి స్థాయిలో త్వరలోనే మిగతా మండలాలకు సరఫరా అవుతుంది. జిల్లాలోని 15 కేజీబీవీలకు వచ్చిన వస్త్రం ఆయా మండలాలకు అం దజేశాం. త్వరలోనే దుస్తులు కుట్టే ప్రక్రియ పూర్తవు తుంది. మిగతా పాఠశాలలకు సంబందించి వస్త్రం రాగానే ఏపీఎంల ద్వారా దుస్తులు కుట్టే పనులు వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా విద్యార్థులకు పంపిణీ చేసేందుకు కృషి చేస్తాం.