పంట నష్టం చెల్లించేదెప్పుడో...?
ABN , Publish Date - Aug 10 , 2026 | 10:59 PM
భారీ వర్షాల కారణంగా పంటలు కోల్పోయిన రైతంగానికి సంవ త్సరం గడుస్తున్నా ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు ప రిహారం అందలేదు. గత ఏడాది ఆగస్టు 28న జిల్లాలో కురిసిన భారీ వర్షాలు రైతులకు తీరని నష్టం మిగి ల్చాయి.
-గోదావరి ఉప్పొంగడంతో నీట మునిగిన వరి, పత్తి
-జిల్లాలో 13వేల పై చిలుకు ఎకరాలు వరదలపాలు
-ప్రకృతి వైపరీత్యం కారణంగా రైతులకు తీరని నష్టం
-ప్రతిపాదనలకే పరిమితం అవుతున్న పరిహారం చెల్లింపులు
-ఏడాది గడుస్తున్నా ఊసెత్తని ప్రభుత్వం
-సీఎం హామీ ఇచ్చినా ముందుకు కదలని ప్రక్రియ
మంచిర్యాల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల కారణంగా పంటలు కోల్పోయిన రైతంగానికి సంవ త్సరం గడుస్తున్నా ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు ప రిహారం అందలేదు. గత ఏడాది ఆగస్టు 28న జిల్లాలో కురిసిన భారీ వర్షాలు రైతులకు తీరని నష్టం మిగి ల్చాయి. అల్పపీడన ప్రభావం కారణంగా అప్పుడు రెం డు రోజులపాటు ఏకదాటిగా కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో పంటలకు నష్టం వాటి ల్లింది. వర్షాల కారణంగా నాట్ల దశలో ఉన్న వరి వర దల్లో కొట్టుకుపోగా, ఏపుగా పెరుగుతున్న పత్తిపంట పూర్తిగా నీట మునిగింది. ఆ సంవత్సరం వర్షాకాలం సీ జన్ ప్రారంభమైన నాటి నుంచి నాలుగు దఫాలుగా వ ర్షాలు రైతులను కడుపుకోతకు గురిచేశాయి.
జిల్లాలో 13వేల ఎకరాల్లో నష్టం...
గత సంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షం కా రణంగా జిల్లాలో 7781 మంది రైతులకు చెందిన 13126 ఎకరాల్లో పంటలు వరదపాలయ్యాయి. జిల్లా లోని భీమిని, తాండూరు, మందమర్రి, నెన్నెల, వేమ నపల్లి, కన్నెపల్లి, కోటపల్లి, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, కాసి పేట, హాజీపూర్, చెన్నూరు, జైపూరు, జన్నారం మండ లాల్లో 3215 మంది రైతులకు చెందిన 4964 ఎకరాల వరి పంట నీట మునగగా, 4538 మంది రైతులకు చెందిన 8107 ఎకరాల పత్తి చేలలో నీరు నిలిచింది. అలాగే 13 మంది రైతులకు చెందిన 35 ఎకరాల మి ర్చి, 15 మందికి చెందిన 20 ఎకరాల కూరగాయల సాగు సైతం వర్షార్పణం అయింది. వర్షాల కారణంగా వరికి ఎకరాకు రూ. 10వేల చొప్పున రూ. 4 కోట్ల 96 లక్షల 40 వేల వరకు నష్టం వాటిల్లగా, పత్తి పంటకు ఎకరాకు రూ. 15వేల చొప్పున మొత్తం 12 కోట్ల 16 ల క్షల 5వేల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు అం చనా. భారీ వర్షాలకు తోడు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు తెరవడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చిన కారణంగా నది పరివాహక ప్రాంతాల్లో 2025 ఆగస్టు 29న వేలాది ఎకరాల్లో ఏపుగా పెరిగిన పంట ముంపునకు గురైంది. అలాగే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా వివిధ రకాల చేతికి వచ్చిన పంట పెద్ద మొత్తంలో నీటి పాలైంది. పై మూడు నెలల్లో ఏకంగా 2310 మందికి చెదిన 3505 ఎకరాల పంట నీట మునగగా, ఆగస్టులో వేలాది ఎకరాలు నీళ్లపాలైం ది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా బాధిత రైతులకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.
ప్రతిపాదనలకే పరిమితం....!
అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రై తులకు ఎకరాకు రూ. 10వేల పరిహారం అందిస్తామ ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2025 మార్చి నుంచి మొదలుకొని ఆగస్టు వరకు కురిసిన వ ర్షాల కారణంగా రైతులకు జరిగిన నష్టాన్ని వ్యవసా యశాఖ అధికారులు అంచనా వేసి, సంబంధిత రిపో ర్టును ప్రభుత్వానికి అందజేశారు. సంవత్సరం గడుస్తు న్నా ఇప్పటి వరకు బాధిత రైతులకు పరిహారం అంద లేదు. మార్చి నుంచి మే వరకు జరిగిన నష్టం అధికా రుల అంచనా ప్రకారం రూ. 3,50,63,250 ఉంటుంది. అలాగే ఆగస్టులో 28వ తేదీ వరకు సుమారు రూ. 25 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
సీఎం హామీ ఇచ్చినా అందని పరిహారం...!
భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చ డంతో ముఖ్యంగా రైతులకు భారీ నష్టం సంభవించిం ది. వరదల ప్రభావాన్ని పరిశీలించేందకు రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గత ఏడాది ఆగస్టు 28న చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ఏరియల్ సర్వేలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ అధికారులతో మా ట్లాడుతూ జరిగిన నష్టాన్ని అంచనా వేసి రిపోర్టును తక్షణమే ప్రభుత్వానికి అందజేయాలని సీఎం ఆదేశిం చారు. స్వయంగా సీఎం ఆదేశించడంతో అధికారులు ఉరుకులు, పరుగుల మీద నష్టం అంచనా వేసి, ని వేదికను ప్రభుత్వానికి అందజేయగా, పరిహారం అందు తుందేమోనని రైతులు ఆశపడ్డారు. అయితే సీఎం హా మీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా రైతులకు నష్ట పరిహా రం అందకపోగా, ప్రతిపాదనలు అందజేసినా ప్రభు త్వం ఆ ఊసే ఎత్తకపోవడంతో ఆ ప్రక్రియ అంతటి తోనే నిలిచిపోయింది.