Share News

అంగ న్‌వాడీ కేంధ్రాలకు సొంత భవనాలెప్పుడో..?

ABN , Publish Date - Jun 21 , 2026 | 11:39 PM

అంగన్‌ వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న పలు వి ధానాలు కొంతమేర సత్ఫలితాలిస్తున్నాయి.

అంగ న్‌వాడీ కేంధ్రాలకు సొంత భవనాలెప్పుడో..?

-ఏడాది క్రితమే నూతన భవనాలు మంజూరు

-నిధుల కొరతతో ముందుకు సాగని పనులు

-అద్దె భవనాల్లోనే కాలం వెళ్లదీత

-సత్ఫలితాలిస్తున్న ఫొటో క్యాప్చర్‌ విధానం

మంచిర్యాల, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): అంగన్‌ వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న పలు వి ధానాలు కొంతమేర సత్ఫలితాలిస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని కేం ద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బంది చేతివాటంతో పిల్లలు, మహి ళలకు అందాల్సిన గుడ్లు, పాలు, పప్పు, తదితర సామగ్రి బహి రంగ మార్కెట్‌లో దర్శనమిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటు న్నాయి. పలు ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు నామ మాత్రంగా నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రాలకు వచ్చిన సరుకులు, విద్యార్థులు హాజరు సహా అంగన్‌వాడీని పూర్తిగా ప్ర క్షాళన చేపట్టేలా ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదట్లో కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఆ తరువాత బయోమెట్రిక్‌ విధానం అ మలు చేయాలని అనుకున్నప్పటికీ అదీ సాధ్యపడలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫొటో క్యాప్చర్‌ విధానంతో అక్రమాలను అరికడుతు న్నప్పటికీ, సొంత భవనాల నిర్మాణంలో మాత్రం అడుగులు ముం దుకు పడటం లేదు. దీంతో అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల మధ్య కేంద్రాలు కొనసాగాల్సిన దుస్థితులు నెలకొన్నాయి. ఇరుకు గదుల్లో అంగన్‌వాడీ కేంధ్రాలు నడుపుతుండటంతో విద్యార్థులు, బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఉంది.

ఫొటో క్యాప్చర్‌తో సత్ఫలితాలు...

అంగన్‌వాడీ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్‌ పెట్టేం దుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫొటో క్యాప్చర్‌ విధానం సత్ఫలితా లను ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలు రాకపోయినా... వచ్చినట్లు హాజరు వేస్తూ అక్కడి సిబ్బం ది అక్రమాలకు పాల్పడేవారన్న ఆరోపణలు ఉన్నాయి. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ఇవ్వడం లేదనే విమర్శలూ వెల్లువె త్తాయి. రోజువారి ఆహారం కూడా వడ్డించడం లేదనే ప్రచారం ఉంది. అంగన్‌వాడీ కేంద్రాలకు ఎంత మంది పిల్లలు వస్తున్నా రు..? వారికి ఏమి నేర్పుతున్నారు..?బాలింతలు, గర్భిణులు వస్తు న్నారా..? వారికి మెనూ ప్రకారం ఆహారం ఇస్తున్నారా...? లేదా..? అనే విషయాలపై ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు యా ప్‌ల ద్వారా టీచర్లు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఫొటో క్యాప్చ ర్‌ విధానంతో అంగన్‌వాడీ కేంద్రంలో హాజరయ్యే పిల్లలను ఒక్కొక్కరిగా ఫొటోలు తీసి యాప్‌లలో పొందు పర్చాల్సి ఉంటుం ది. అలాగే గర్భిణులు, బాలింతలు భోజనం చేసే సమయంలోనూ ఇదే విధానం అమలు చేయాలి. తద్వారా ఎంత మంది పిల్లలు, గర్బిణులు, బాలింతలు హాజరవుతున్నారనే పక్కా సమాచారం ప్ర భుత్వాలకు పక్కాగా చేరుతుంది. తద్వారా అక్రమాలకు చెక్‌ పడినట్లేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సొంత భవనాలకు మోక్షమెప్పుడో...!

అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉండాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నా యి...అద్దె భవనాల్లో ఎన్ని ఉన్నాయి..ఎంత మంది టీచర్లు, సిబ్బంది ఉన్నారు...పిల్లలు, గర్భిణులు, బాలింతలు సంఖ్య ఎంత అనే పక్కా సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ అధికారులు జిల్లా అధికారుల నుంచి ప్రభుత్వం సేకరించారు. జిల్లాలో జిల్లాలో 969 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, లక్షెట్టిపేటలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఈ కేం ద్రా లను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు గతేడాది జి ల్లాకు 32 సొంత భవనాలు మంజూరయ్యాయి. జిల్లాలోని 16 మండలాలకుగాను ఒక్కో మండలానికి రెండేసి భవనాల చొప్పున మొత్తం 32 భవనాలు పైలట్‌ ప్రాజెక్టు కింద మంజూరయ్యాయి. ఒక్కో భవనానికి రూ. 12 లక్షలు ఖర్చవుతుండగా, అందులో ఎంజీ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు రూ. 8లక్షలు, స్త్రీ సంక్షేమశాఖ నుంచి రూ. 2 లక్షలు, జిల్లా పరిషత్‌ నిధులు రూ. 2 లక్షల చొప్పున వె చ్చించాల్సి ఉంది. ఇప్పటికే భవనాలకు స్థలాల ఎంపిక పూర్తికాగా, పనులు చేపట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. భవన నిర్మాణా లకు అవసరమైన నిధుల కొరతతోనే అడుగులు ముందుకు పడ టం లేదని తెలుస్తోంది. జిల్లా పరిషత్‌లో నిధుల కొరత కారణంగా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా అవసరమైన నిధులు మంజూరు చేయడం ద్వారా నూ తన భవనాల నిర్మాణం పట్టాలెక్కే విధంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌లు ఉన్నాయి.

Updated Date - Jun 21 , 2026 | 11:39 PM