Share News

kumaram bheem asifabad- వంతెనల నిర్మాణం ఎప్పుడు..?

ABN , Publish Date - Apr 14 , 2026 | 10:45 PM

మారుమూల గిరిజన గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామాలకు వెళ్లా లంటే వాగులు దాటాల్సిందే. ఆ గ్రామాల ప్రజలు వాగు దాటే సమయంలో గిరిజనుల బాధలు వర్ణనా తీతం. గామాల అభివృద్ధికి రోడ్డు, రవాణా కీలకమైనప్పటికీ మండలంలోని చాలా గ్రామాల్లో మట్టి రోడ్డు ఉండగా, మరి కొన్ని గ్రామాలకు వెళ్లేందుకు మార్గమధ్యలో ఉన్న వాగులు, వంకలు ఒర్రెలపై వంతెన నిర్మాణాలు లేక ఏటా వర్షాకాలంలో అక్కడి ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తప్పడం లేదు.

kumaram bheem asifabad- వంతెనల నిర్మాణం ఎప్పుడు..?
శివపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న ఒర్రె

- మారుమూల గ్రామాల ప్రజలు

చింతలమానేపల్లి, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): మారుమూల గిరిజన గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామాలకు వెళ్లా లంటే వాగులు దాటాల్సిందే. ఆ గ్రామాల ప్రజలు వాగు దాటే సమయంలో గిరిజనుల బాధలు వర్ణనా తీతం. గామాల అభివృద్ధికి రోడ్డు, రవాణా కీలకమైనప్పటికీ మండలంలోని చాలా గ్రామాల్లో మట్టి రోడ్డు ఉండగా, మరి కొన్ని గ్రామాలకు వెళ్లేందుకు మార్గమధ్యలో ఉన్న వాగులు, వంకలు ఒర్రెలపై వంతెన నిర్మాణాలు లేక ఏటా వర్షాకాలంలో అక్కడి ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసర సేవలకు సైతం ఇబ్బందులు పడాల్సివస్తోంది. ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ది కోసం ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్పటికీ క్షేత్ర స్థాయిలో అభివృద్ది పూర్తి స్థాయిలో కన్పించడం లేదు. దీనిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇక్కడి ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- మండలంలో పరిస్థితి ఇలా..

మండలంలోని బాబాసాగర్‌ నాయికపుగూడ వాగుపైవంతెన నిర్మాణం కోసం గతంలో పనులు ప్రారంభించినా నిధుల లేమితో ఇప్పటికీ వంతెన అసంపూర్తిగా ఉండడంతో వచ్చే వర్షాకాలం కూడా ఆ గ్రామస్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. గూడెం నుంచి శివపల్లి గ్రామాల మధ్య ఉన్న ఒర్రెపై వంతెన లేదు. ఈ ఒర్రెపై వంతెన నిర్మాణం చేపట్టాలని అక్కడి గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.ు. కర్జెల్లి నుంచి గంగాపూర్‌ గ్రామాల మధ్య ఉన్న ఒర్రె పైవంతెన లేక ఆ గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిత్యం ఈ రోడ్డు గుండా రైతులు పొలాలకు, చేన్లకు వెళ్తుంటారు. రుద్రాపూర్‌- హేటిగూడ గ్రామాల మద్య ఉన్న వాగుపై వంతెన నిర్మాణం పూర్తి చేసినా ఇరువైపులా రహదారి నిర్మాణం పూర్తి చేయాలని అక్కడి గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే దిందా-కేతిని గ్రామాల మధ్య ఉన్న వాగుపై హైలెవల్‌ వంతెన నిర్మాణం కోసం గతంలో పీఎంజేఎస్‌వై నిధులు రూ.3 కోట్లు మంజూరైనా అటవీ అనుమతులు లేక పనులు ప్రారంభం కాలేదు. అటవీఅనుమతులు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు కృషితో అటవీ అనుమతులు లభించగా వంతెన నిర్మాణ పనులు ప్రారంభమ య్యాయి. ఏళ్ల కళ వారికి నెరవేరనుంది. దిందా గ్రామస్థులు ఏళళ్లవగా ఈ వంతెన నిర్మాణం కోసం పోరాడా రు. ఈ వర్షాకాలం లోగా పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

- వర్షాకాలంలో మరిన్ని కష్టాలు..

మండలంలోని పలు గ్రామాల ప్రజలు వర్షాకాలంలో అనేక అవస్థలు పడాల్సి వస్తోం ది. వారం పదిహేను రోజుల పాటు వర్షాల కారణంగా వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించడం వల్ల దాటలేని పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. బాహ్యప్రపంచానికి దూ రంగా ఉంటూ బతకాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కనీసం అత్యవసర సమయాల్లో సైతం ఇబ్బందులు తప్పడం లేదు. రవాణా పరంగా ఇబ్బందులు ఉండడంతో సరకులు, ఇతర సామగ్రి తీసుకురావడం, రైతులు చేలకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం. ఇప్పటికైనా అధికారులు వాగులు, ఒర్రెలపై పూర్తి స్థాయిలో వంతెన నిర్మాణాలు చేపట్టి ఇబ్బందులు లేకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Apr 14 , 2026 | 10:45 PM