Share News

kumaram bheem asifabad- కోఆప్షన్‌ ఎన్నిక ఎప్పుడు..?

ABN , Publish Date - Jun 18 , 2026 | 10:28 PM

మున్సిపాలిటీల్లో కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ మరుగున పడింది. కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక కోసం అధికారులు రెండు నెలల క్రితం ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో రెండు మున్సిపాల్టీలో కోఆప్షన్‌ పదవుల కోసం దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం పూర్తి స్థాయిలో బరిలో ఉండే అభ్యర్థులను గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు. కాని ఇంత వరకు ఎలాంటి గ్రీన్‌ సిగ్నల్‌ రాక పోవడంతో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పెండింగ్‌లోనే ఉంది.

kumaram bheem asifabad- కోఆప్షన్‌ ఎన్నిక ఎప్పుడు..?
లోగో

కాగజ్‌నగర్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీల్లో కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ మరుగున పడింది. కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక కోసం అధికారులు రెండు నెలల క్రితం ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో రెండు మున్సిపాల్టీలో కోఆప్షన్‌ పదవుల కోసం దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం పూర్తి స్థాయిలో బరిలో ఉండే అభ్యర్థులను గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు. కాని ఇంత వరకు ఎలాంటి గ్రీన్‌ సిగ్నల్‌ రాక పోవడంతో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పెండింగ్‌లోనే ఉంది. దీంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు తదుపరి ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. తెలంగాణ మున్సిపల్‌ చట్టం ప్రకారం మున్సిపాలిటీలో కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది.

- రెండు మున్సిపాలిటీల్లో..

జిల్లాలోని కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మున్సిపాలీటీల్లో కూడా ఈ ఎన్నికలపై రాజకీయ వర్గాలు దృష్టి సారించిన విషయం తెలిసిందే. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల్లో నాలుగు కోఆప్షన్‌ సభ్యుల రెండు కేటగిరిలుగా విభజించారు. ఇందులో రెండు జనరల్‌ స్థానాలు, రెండు మైనార్టీ స్థానాలకు కేటాయించారు. జనరల్‌ స్థానాలకు 14 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో తిరస్కరణ ప్రక్రియ తర్వాత ఆరు దరఖాస్తులను మాత్రమే అనుమతించారు. మైనార్టీ విభాగంలో 19 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఐదుగురు సభ్యులకు మాత్రమే బరిలో ఉండగా, మిగితా దరఖాస్తులను తిరస్కరించారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో కూడా రెండు జనరల్‌, రెండు మైనార్టీ స్థానాలకు దరఖాస్తులను తీసుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదికలను పంపించారు. ఎన్నికల షెడ్యూల్‌ కోసం అంతా నిరీక్షిస్తున్నారు. మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక కాగజ్‌నగర్‌లో ఉత్కంఠగా ఉంది. ఆసిఫాబాద్‌ మున్సిపాల్టీలో పోటీ తీవ్రంగా లేకుండానే విశేషం. మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఎన్నికల సమయంలో ఆశావహులకు టికెట్టు ఇవ్వకుండా ఆయా పార్టీల నాయకులు బుజ్జగించి కోఆప్షన్‌లో చూసుకుందామని హామీ ఇచ్చారు. చివరకు ఎలాగో లైన్‌ క్లియర్‌ చేసి తుది వరకు నెట్టుకొచ్చారు. కాని ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాక పోవటంతో అంతా ఎదురు చూస్తున్నారు. అసలు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారోనని మున్సిపల్‌ కార్యాలయానికి నిత్యం వచ్చి దరఖాస్తుదారులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతిని వివరణ కోరగా కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక కోసం దరఖాస్తులను స్వీకరించామని చెప్పారు. తిరస్కరణ తర్వాత తుది జాబితాను ఉన్నతాధికారులకు పంపించామని వివరించారు. తదుపరి ఉత్తర్వులు రాగానే ఎన్నికల ప్రక్రియ వివరాల ప్రకటిస్తామని తెలిపారు.

Updated Date - Jun 18 , 2026 | 10:28 PM