తెలంగాణలో వచ్చేది బీసీల రాజ్యమే
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:35 PM
తరతరాలుగా అధిక జనా భా ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రజల ఓట్లతో గద్దెనెక్కుతున్న వారి కి త్వరలోనే కాలం చెల్లబోతుందని, తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది ఇక బీసీల రాజ్యమేనని తెలంగాణ రా జ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అన్నారు.
- కొల్లాపూర్లో టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
కొల్లాపూర్, అక్టోబరు 17 (ఆంధ్ర జ్యోతి) : తరతరాలుగా అధిక జనా భా ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రజల ఓట్లతో గద్దెనెక్కుతున్న వారి కి త్వరలోనే కాలం చెల్లబోతుందని, తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది ఇక బీసీల రాజ్యమేనని తెలంగాణ రా జ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అన్నారు. ఆయన చేపట్టిన పాదయాత్ర శనివారం కొల్లాపూర్ ప ట్టణానికి చేరింది. పట్టణంలోని ఎన్టీఆ ర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మల్లన్న మాట్లాడారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి చరిత్ర ఉందని, ఇక్కడ రెం డుసార్లు బీసీలు ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వ హించారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీ ఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్య పెడుతున్నా యని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొల్లాపూర్ మండలం అమరగిరి గ్రామానికి మంజూరై, అటవీ శాఖ అనుమతులు లేక నిలిచిపోయిన బీటీ రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అమరగిరి గ్రామ 6వ వార్డు సభ్యుడు ఆకున మోని భరత్ యాదవ్ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్నకు వినతిపత్రం అందజేశారు.