Share News

kumaram bheem asifabad-సేంద్రియ ఎరువు తయారేది..?

ABN , Publish Date - Feb 24 , 2026 | 10:50 PM

గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచడంతో పాటు వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారీ లక్ష్యంగా సెగ్రిగేషన్‌ షెడ్లు నిర్మించారు. పల్లెల అభ్యున్నతి కోసం అప్పటి ప్రభుత్వం గ్రామాల్లో సేంద్రియ ఎరువులు తయారీ కోసం షెడ్ల నిర్మాణం చేపట్టింది.

kumaram bheem asifabad-సేంద్రియ ఎరువు తయారేది..?
నిరుపయోగంగా ఉన్న సెగ్రిగేషన్‌షెడ్డు

- నిర్మాణాలకే పరిమితం

- పట్టించుకోని అధికారులు

బెజ్జూరు, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచడంతో పాటు వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారీ లక్ష్యంగా సెగ్రిగేషన్‌ షెడ్లు నిర్మించారు. పల్లెల అభ్యున్నతి కోసం అప్పటి ప్రభుత్వం గ్రామాల్లో సేంద్రియ ఎరువులు తయారీ కోసం షెడ్ల నిర్మాణం చేపట్టింది. పారిశుధ్య నిర్వహణతో పాటు సేంద్రియ ఎరువును సమకూర్చాలని ఒక్కో పంచాయతీకి సెగ్రిగేషన్‌ షెడ్డును అందుబాటులోకి తీసురావాలని సంకల్పించి ఒక్కో షెడ్డుకు రూ.2.40లక్షలు మంజూరు చేసింది. గ్రామాల్లో సేకరించిన చెత్తను ఇక్కడికి చేర్చి గాజు, ఇనుము, ప్లాస్టిక్‌ వంటి తదితర పొడి చెత్త వ్యర్థాలను వేరు చేసి గడులలో భద్రపరుస్తారు. తడి చెత్తను కుండీలలో వేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తారు. వీటి నిర్వహణ బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగించారు. వీటి ద్వారా గ్రామాల్లో సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు విక్రయించాలి. కాగా ఆయా గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయినా సెగ్రిగేషన్‌ షెడ్లు అలంకారప్రాయంగా మారాయి. మరి కొన్నిచోట్ల షెడ్లలోని గడుల్లో తడి, పొడి చెత్తను వేసి అలాగే వదిలేశారు. దీంతో సెగ్రిగేషన్‌ షెడ్ల పరిసర ప్రాంతా ల్లో కాలుష్యం పెరుగుతోంది. దీన్ని నివారించడానికి, సేంద్రియ ఎరు వు తయారు చేయడానికి నిర్మించిన షెడ్లు ఎక్కడా కూడా ఉపయోగంలోకి తీసుకురాకుండా వదిలేశారు.

- జిల్లా వ్యాప్తంగా ..

జిల్లా వ్యాప్తంగా 335పంచాయతీలకు షెడ్లు మం జూరయ్యాయి. మంజూరైన 335షెడ్లు ఇప్పటికే పూ ర్తి చేశారు. గ్రామాల్లో సేంద్రియ ఎరువుల తయా రీపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రభు త్వ ఆశయం నెరవేరడం లేదు. ప్రతి రోజు ఇళ్ల నుంచి సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి వాటిని అమ్మితే గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతుంది. అలాగే మిగితా చెత్తను నాడెప్‌ వర్మి కంపోస్టు ట్యాంకులో వేసి ఎరువు తయారు చేసి విక్రయించడంతో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సేంద్రీయ ఎరువుల తయారీకి అప్పట్లో వానపాములను కూడా సరఫరా చేసినా ఫలితం లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.

- అవగాహన లోపంతోనే..

గ్రామాల్లో పారిశుధ్య సిబ్బందికి, కార్యదర్శులకు సేంద్రియ ఎరువు తయారీపై అవగాహన లేకపోవడంతోనే సెగ్రిగేషన్‌ షెడ్లు నిరుపయోగంగా మారా యని చెబుతున్నారు. అప్పట్లో వీరికి శిక్షణ ఇచ్చినప్పటికీ వర్మి కంపోస్టు తయారీ పద్ధతి తెలియకపోవడం, పంచాయతీల్లో సరిపడా సిబ్బంది, గ్రామాల్లో డంప్‌ యార్డులు లేకపోవడంతోనే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. సంబందిత అధి కారులు పట్టించుకోని కారణంగా వృథాగా మారాయి. కొన్ని పంచాయతీల్లో మాత్రం షెడ్లను వినియోగించుకుంటూ సేంద్రియ ఎరువును తయా రీ చేసి పంచాయతీకి ఆదాయం సమకూర్చుతున్నా పూర్తిస్థాయిలో తయారీ లేక ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.

- నిర్వహణలో నిర్లక్ష్యం..

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణంతో అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి పెద్దగా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. వీటి నిర్మాణంలో చూపిన శ్రద్ద నిర్వహణలో చూపక పోవడంతో ఎరువుల తయారీకి అవకాశం ఉన్నా అందిపుచ్చుకోలేదు. కాగా రాష్ట్రంలో ప్రభుత్వం మార డంతో సేంద్రియ ఎరువుల తయారిపై దృష్టి సారిసా ్తరేమోనన్న ఆశలు చిగురిస్తున్నాయి. అప్పటి ప్రభు త్వం పట్టించుకోక పోవడంతో ఎరువుల తయారీకి నోచుకోక మూలన పడ్డాయి. ప్రస్తుతం గ్రామపంచా యతీల పాలనా గడువు కూడా ముగియడంతో ఇప్పు డు వీటి నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. పంచాయ తీలకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేకపోవడంతో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికా రులను నియమించింది. దీంతో ప్రత్యేక అధికారులు అయినా సేంద్రియ ఎరువుల తయారీపై దృష్టి సారి స్తారా లేదా తెలియాల్సి ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ మైనా వీటిపై ప్రత్యేక దృష్టి సారించి సేంద్రియ ఎరువులు తయారీ చేసి ఉపయోగపడేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Feb 24 , 2026 | 10:50 PM