Share News

kumaram bheem asifabad-సాగు తీరు ఎలా..?

ABN , Publish Date - Nov 10 , 2026 | 10:36 PM

జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పోవడంతో ప్రస్తుతం ఖరీఫ్‌ పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. మరో వైపు యాసంగి సాగుపై నీలినీడలు కమ్ము కున్నాయి. అధిక నీటి అవసరం ఉన్న వరి సాగు చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. నీటి లభ్యత లేని ప్రాంతాల్లో ఆరుతడి పంటల సాగు చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. రైతు వేదిల్లోక అవగాహన సదస్సులు సైతం నిర్వహిస్తున్నారు.

kumaram bheem asifabad-సాగు తీరు ఎలా..?
లోగో

- ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం ప్రోత్సాహం

కాగజ్‌నగర్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పోవడంతో ప్రస్తుతం ఖరీఫ్‌ పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. మరో వైపు యాసంగి సాగుపై నీలినీడలు కమ్ము కున్నాయి. అధిక నీటి అవసరం ఉన్న వరి సాగు చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. నీటి లభ్యత లేని ప్రాంతాల్లో ఆరుతడి పంటల సాగు చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. రైతు వేదిల్లోక అవగాహన సదస్సులు సైతం నిర్వహిస్తున్నారు. అన్నదాత ఆరుతడి పంటల వైపు మళ్లించటానికి ప్రతి ఆదివారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమాల్లోను అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో వావాకాలం సీజన్‌లో 1,103 మల్లీమీటర్ల సాధారణ వర్షానికి 1,019 మిల్లీమీటర్ల వర్షం పాతం నమోదు అయింది. మారిన పరిస్థితులు పొడి తావారణంతో జలనవరులు ఎండి పోతున్నాయి. పంటలకు సరిపడా సాగునీరు లేక అన్నదాతలు కలవరపడుతున్నారు. వ్యవసాయా శాఖ అధికారులు రైతులను యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించడానికి అవగాహనసదస్సు లు నిర్వహిస్తున్నారు. మరో వైపు యాసంగి సాగు చేపట్టేందుకు రైతులు వెనకడుగు వేయడానికి విద్యు త్‌ సరఫరాపై ఉన్న అనిశ్చితి కూడా కారణంగా కనిపిస్తోంది. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగితే పంటల కు నీటి అవసరం అధికమవుతుంది. బోర్లు, బావులపై ఆధారపడే రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరా కీలకం. సాగు ప్రారంభించిన తర్వాత కరెంటు కోతలు ఎదురైతే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు ఎల్‌నినో ప్రభావం, మరో వైపు నీటి లభ్యత సందేహాలు ఇంకో వైపు విద్యుత్‌ సరఫరాపై భయా లు, వెరసి ఈ సారి జిల్లాలో యాసంగి సాగు ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి నెలకొంది. వ్య వసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగా హన కల్పించడంతో పాటు సాగునీరు, విద్యుత్‌ సరఫ రాపై భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.

- తక్కువ నీటితో..

తక్కువ నీటితో పండే కంది, జొన్న, పెసర, శన గలు, పప్పు ధాన్యాలు ఇతర చిరుధాన్యాల పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు. నీటి లభ్యత విత్తనాల ఎంపిక స్వల్పకాలిక పంటల సాగుతో మెరుగైన దిగుబడులు సాఽధించవచ్చని వ్యవసాయాధి కారులు సూచిస్తున్నారు. గతేడాది యాసంగి సీజన్‌లో మొత్తం 57,598 విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. అప్పుడు 23,992 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ సారి కేవలం 8,500 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఆరుతడి పంటల వైపు రైతును ప్రొత్సహించేందుకు ఇప్పటికే 75 క్వింటాళ్ల శనగా, 30 క్వింటాళ్ల పెసరి విత్తనాలను అందుబాటులోకి ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశా రు. ఈ విసయమై జిల్లా వ్యవసాయాధికారి వెంకట్‌ ను వివరణ కోరగా వర్షా భావ పరిస్థితుల నేపథ్యంల రైతులు సంప్రదాయ పంటలు సాగు చేయొద్దని చెప్పారు. తక్కువ నీటితో మెరుగైన దిగుబడులు వచ్చే జొన్న, కంది, పెసర్లు, మినుములు, మొక్కజొన్న ఇతర చిరుధాన్యాలు సాగు చేస్తే బాగుంటుందని తెలిపారు. గతేడాది వరి పంట 23,932, మొక్క జొన్న 9,101, గోధుమ 972, ఆయిల్‌పామ్‌ 330 ఇతర పంటలను పూర్తిగా కలుపుకొంటే 22,765 ఎకరాల్లో సాగు చేశారని వివరించారు. ఈ విషయంలో రైతుల కు అవగాహన పరుస్తున్నామని తెలిపారు. యాసంగి లో ఆరుతడి పంటలు వేస్తేనే మేలు జరుగుతుందని, రైతులు గమనించాలని తెలిపారు.

Updated Date - Nov 10 , 2026 | 10:36 PM