kumaram bheem asifabad- ఉపాధి కూలీలకు పనిముట్లేవి?
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:22 PM
పేదలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టింది. కూలీ అందిస్తూనే పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. పనిచేసేటప్పుడు ప్రమాదం జరిగితే చికిత్స కూడా అందించాల్సి ఉంటుంది. పని చేస్తున్న కూలీలకు పనిముట్లు కూడా అందించాల్సి ఉంటుంది. ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రారంభంలో పనిముట్లు అందించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు పనిముట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో పని చేసే కూలీలే పనిముట్లు కొనుగోలు చేస్తూ పనులు చేపడుతున్నారు
బెజ్జూరు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): పేదలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టింది. కూలీ అందిస్తూనే పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. పనిచేసేటప్పుడు ప్రమాదం జరిగితే చికిత్స కూడా అందించాల్సి ఉంటుంది. పని చేస్తున్న కూలీలకు పనిముట్లు కూడా అందించాల్సి ఉంటుంది. ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రారంభంలో పనిముట్లు అందించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు పనిముట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో పని చేసే కూలీలే పనిముట్లు కొనుగోలు చేస్తూ పనులు చేపడుతున్నారు. దీంతో కూలీలకు అదనపు భారం పడుతోంది. గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు పనిముట్లు అందక, బయట సొంతంగా కొనుగోలు చేయాల్సి వస్తోందని కూలీలు వాపోతున్నారు.
జిల్లాలో 2.39 లక్షల మంది కూలీలు..
జిల్లాలో 15 మండలాల పరిధిలో 2.39లక్షల మంది కూలీలు ఉన్నారు. జిల్లాలో 1.22లక్షల జాబ్‌కార్డులు, క్రియాశీలక జాబ్‌కార్డులు 88వేలు ఉన్నాయి. ఇందులో 1.61లక్షల మంది కూలీలు పని చేస్తున్నారు. గతంలో పథకం ప్రారంభించిన సమయంలో కూలీలకు అవసరమైన గడ్డపారలు, తట్టలు, పారలు సరఫరా చేసింది. కూలీలు చెరువుల్లో పూడికతీత, పంట కాలువలు, కందకాలు, గుంతలు తవ్వడం తదితర పనులకు వినియోగించేవారు. అయితే గత పదేళ్లుగా పనిముట్ల పంపిణీ లేదు. దీంతో ఉ.పాధి పనికి వెళ్తున్న కూలీలకు ఆర్థికంగా ఇబ్బందిగా మారింది. ప్రతి ఏటా కూలీలు పనిముట్లను కొనుగోలు చేయాల్సి వస్తుండటంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని కూలీలు వాపోతున్నారు. చాలీచాలని కూలీతో పని చేస్తున్నా అదనంగా పనిముట్లను కొనుగోలు చేయాల్సి వస్తుం డడంతో మరింత భారంగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపాధి కూలీలకు గతంలో ఇచ్చినట్లుగా పనిముట్లను పంపిణీ చేయాలని కూలీలు కోరుతున్నారు.
సరఫరా లేదు..
- ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో, బెజ్జూరు
ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు పనిముట్లను ప్రభుత్వం పంపిణీ చేయ డం లేదు. గతంలో కూలీలకు పనిముట్లు ఇచ్చారు. గత కొద్దేళ్ల నుంచి పంపిణీ నిలిచిపోయిం ది. ప్రభుత్వం సరఫరా చేసినట్లయితే కూలీలకు అందజేస్తాం.