kumaram bheem asifabad- ఆన్‌లైన్ సేవలేవి..?
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:10 PM
పంచాయతీల్లో ఆన్‌లైన్ సేవలు అందక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పౌరసేవల పంపిణీలో వేగంతో పాటు పారదర్శక తను పెంపొందించడానికి అవసరమైన డిజిటల్ వసతులు పల్లెల్లో కరువయ్యాయి. గ్రామ పంచాయతీల్లో ఇంట ర్‌నెట్ సదుపాయం అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చేపట్టిన టీ-ఫైబర్ పథకం అర్ధాంతరంగా ఆగిపోయింది. గ్రామ పరిపాలనలో కీలకమైన పంచా యతీల్లో డిజిటల్ సేవలు అమలు కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తు తున్నాయి.
- అందుబాటులోకి రాని డిజిటల్ సేవలు
- సాంకేతికతకు దూరంగా పంచాయతీలు
- పట్టించుకోని అధికారులు
వాంకిడి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పంచాయతీల్లో ఆన్‌లైన్ సేవలు అందక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పౌరసేవల పంపిణీలో వేగంతో పాటు పారదర్శక తను పెంపొందించడానికి అవసరమైన డిజిటల్ వసతులు పల్లెల్లో కరువయ్యాయి. గ్రామ పంచాయతీల్లో ఇంట ర్‌నెట్ సదుపాయం అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చేపట్టిన టీ-ఫైబర్ పథకం అర్ధాంతరంగా ఆగిపోయింది. గ్రామ పరిపాలనలో కీలకమైన పంచా యతీల్లో డిజిటల్ సేవలు అమలు కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తు తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధులు పట్టించుకో కపోవడంతో ఇంటర్‌నెట్ సేవలకు వెచ్చించిన కోట్ల రూపాయల నిధులు వృథా అయ్యా యి. ఇటీవలే ఏడు నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. డిజిటల్ సేవలపై కొత్త సర్పంచులు దృష్టి సారిస్తే గ్రామాలు సాంకేతికంగా అభివృద్ధి చెందుతాయి.
- జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లాలో 15 మండలాలు ఉండగా, 335 పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ పంచాయతీకి ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించేందుకు గత ప్రభుత్వ హయాం లో రూ. కోట్ల వ్యయంతో తెలంగాణ ఫైబర్ నెట్ సంస్థ భూమి నుంచి ఓఎఫ్‌సీ కేబుల్ లైన్ వేసింది. పంచాయతీల వారీగా ఇంటర్‌నెట్ పరికరాలు బిగించేందుకు ఓ ప్రైవేటు సంస్థకు పనులు అప్పగిం చింది. దీనిపై జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవ డం, అసలు వాటిని ఎవరు, ఎందుకు బిగిస్తున్నారనే విషయం తెలియకపోవడంతో పనులు ఇష్టారీతిన జరిగాయి. మరోవైపు జిల్లాలోని అనేక పంచాయతీల కు సొంత భవనాలు లేకపోగా ఉన్న చోట్ల శిథిలా వస్థకు చేరాయి. కానీ సొంత గూడు లేని గ్రామా ల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పరికరాలు బిగించారు. ఇంటర్‌నెట్ సర్వర్, ప్యానల్ బాక్సులు, భవనాలపై సోలార్ ఎనర్జీ పాయింట్లను సైతం ఏర్పాటు చేశారు. విద్యుత్తు లేని సమయంలో సౌర విద్యుత్తుతో నడిచేలా బ్యాటరీలను బిగించారు. అన్ని చేసిన అధికారులు వాటిని ప్రారంభించక పోవడం, కనెక్షన్లు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం చాలా చోట్ల పరికరాలు మూలనపడ్డాయి. రూ. కోట్ల నిధులు వృధా అయ్యాయి.
- అక్రమాలకు అడ్డుకట్ట..
ఈ - పాలనతో పంచాయతీ పరిధిలో జరిగే అక్ర మాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. మరణ ధ్రువప త్రాలతో పాటు ఆదాయ, కుల ధ్రువపత్రాలు పంచాయతీల నుంచి జారీ చేసేలా చర్యలు తీసుకునే వీలుంటుంది. ఇంటి పన్నుల వసూళ్లలోనూ పారద ర్శకత ఉంటుంది. మరోవైపు చాలా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ అనుమతులు ఇష్టారాజ్యాంగ సాగుతున్నా యి. ఇంటర్‌నెట్ సదుపాయం ఉంటే పట్టణ ప్రాంతా ల మాదిరిగా పల్లెలోనూ నిర్మాణాలకు టీఎస్ బీపాస్ అమలు చేయవచ్చు. ఆన్‌లైన్ సదుపాయం ఉంటే కార్యదర్శులు, ఇతర సిబ్బంది హాజరు, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, వీబీ- జీ రామ్‌జీ నిఽధులు, ఆదాయ వ్యయాలు, తదితర వాటిని కంప్యూ టర్లలో ఎప్పటికప్పుడు నమోదు చేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఆ దిశగా చర్యలు తీసు కోవాలని ప్రజలు కోరుతున్నారు.