Share News

మక్కల పైసలేవి..?

ABN , Publish Date - May 29 , 2026 | 11:30 PM

రబీ సీజ న్‌లో మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి ప్ర భుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబంఽధిత రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్‌ రెండో వారం నుంచి మొక్కజొన్న పంట కొనుగోలు చేయగా, నెల రో జులు గడిచినా ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు ల ఖాతాల్లో నగదు జమ చేయకపోవ డంతో ఇ బ్బందులు తప్పడం లేదు.

మక్కల పైసలేవి..?
దండేపల్లిలోని కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న పంటను కవర్లు కప్పి కాపాడుతున్న దృశ్యం

-కొనుగోళ్లు పూర్తికావస్తున్నా చేతికందని నగదు

-చెల్లింపుల కోసం రైతుల ఎదురు చూపు

-జిల్లాలో 8వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

-రూ. 34 కోట్ల మేర చెల్లింపులు పెండింగ్‌

మంచిర్యాల, మే 29 (ఆంధ్రజ్యోతి): రబీ సీజ న్‌లో మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి ప్ర భుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబంఽధిత రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్‌ రెండో వారం నుంచి మొక్కజొన్న పంట కొనుగోలు చేయగా, నెల రో జులు గడిచినా ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు ల ఖాతాల్లో నగదు జమ చేయకపోవ డంతో ఇ బ్బందులు తప్పడం లేదు. మక్కల కొనుగోళ్ల కో సం మార్క్‌ఫెడ్‌కు బ్యాంక్‌ గ్యారంటీని ప్రభు త్వం ఇచ్చినప్పటికీ, రుణం విడుదల కాకపోవ డంతో రైతులకు చెల్లింపులు నిలిచిపోయాయి. బ్యాంకు రుణం విడుదల చేస్తే తప్ప రైతుల కు డబ్బుల చెల్లింపులు జరిగే అవకాశాలు లేవు. ప్రైవేటు మార్కెట్లో అమ్ముకున్నా ఇప్పటికే డ బ్బులు చేతికి వచ్చేవని, సాగు ఖర్చులకు ఉ పయోగపడేవని రైతులు చెబుతున్నారు. ప్రైవే టును కాదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొను గోలు కేంద్రాల్లో విక్రయిస్తే అసలుకే మోసం వ చ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెలల తరబడి డబ్బుల కోసం ఎదురు చూ డా ల్సి రావడంతో మొక్కజొన్న రైతులు నానా ఇ బ్బందులు పడుతున్నారు. మరోవైపు కొనుగో లు చేసిన మొక్కజొన్న ధాన్యాన్ని నిల్వ చేసేం దుకు సరిపడా గోదాములు లేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.

రూ. 34 కోట్ల మేర పెండింగ్‌...

జిల్లాలో యాసంగి సీజన్‌లో 7,141 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఎకరానికి 35 క్వింటాళ్ల చొప్పున మొత్తం 2,49, 935 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారు లు అంచనా వేశారు. మక్కలు కొనుగోలు చే సేందుకు జిల్లాలోని జన్నారం, దండేపల్లి, లక్షె ట్టిపేట, హాజీపూర్‌, వేమనపల్లి మండలాల్లో ఐ దు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఈ నెల 26వ తేదీ వరకు 1648 మంది రైతుల నుంచి 83,775 క్వింటాళ్లను కొనుగోలు చేశారు. మరో 30 శాతం మేర కొనుగోలు పెం డింగ్‌ ఉంది. ఓ వైపు కొనుగోళ్లు పూర్తి కావస్తు న్నా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో ప్రభుత్వ నగదు జమ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రక టించిన విధంగా మొక్కజొన్న పంట కు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) క్వింటాకు రూ. 2400 ఉంది. ఆ లెక్కన ఇప్పటి వరకు కొనుగోలు చేసిన పంటకు సంబంధించి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ. 34.90 కోట్లు జమ చేయాల్సి ఉం ది. మరోవైపు పంట సాగు కోసం చేసిన అప్పు లు తీర్చలేక రైతులు ఇబ్బందులు పడుతు న్నారు. ప్రభుత్వం డబ్బులు చెల్లించక పోవడం తో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించాల్సి వస్తోం దని ఆవేదన చెందుతున్నారు. కొనుగోళ్ల సమ యంలో రకరకాల ఆంక్షలు ఎదుర్కోవడం, ఆ తరువాత చెల్లింపుల కోసం ఎదురు చూపులు తప్పడం లేదంటూ వాపోతున్నారు. ఇదిలా ఉం డగా, వానాకాలం సాగు ఏర్పాట్లు కూడా జరు గుతున్నందన ప్రభుత్వం మొక్కజొన్న డబ్బులు చెల్లించాలనే విజ్ఞప్తులు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.

లారీల కొరతతో ఇబ్బందులు...

మక్క రైతులను లారీల కొరత తీవ్రంగా వే ధిస్తోంది. నెల రోజుల క్రితమే పంటను కల్లాల కు తరలించి కాంటా పెట్టగా సగభాగం తరలిం చగా, మిగతాది లారీలు సమయానికి రాకపోవ డంతో కల్లాల్లోనూ మూలుగుతోంది. దీంతో రై తులు పంటను కాపాడుకోవడం కోసం ఇంటిల్లి పాది రోజుల తరబడి కల్లాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు అకాల వర్షాలు కురుస్తుండటంతో పంటను కా పాడుకోవడం రైతులకు తలనొప్పిగా మారింది. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట నీటి పాలు అవుతుందేమోనన్న భయం రైతులను పట్టుకుంది. కొనుగోలు కేంద్రాల వద్ద సరిప డా లారీలు అందుబాటులో ఉంచకపోవడంతో రై తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదిలా ఉండగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు త మకు తెలిసిన వారి పంటను వెంట వెంటనే తరలిస్తున్న నిర్వాహకులు, పరిచయం లేని రై తుల బస్తాలను లారీలు లేవనే సాకుతో కల్లా ల్లోనే ఉంచుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నగదు జమకాలేదు....

కొత్త వంశీకృష్ణ, దండేపల్లి మండలం ధర్మారావుపేట

ఏడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన. 205 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. మక్క లు కాంటా పెట్టి నెల రోజులైంది. అందులో ఇ ప్పటి వరకు సగం మాత్రమే తరలించారు. లా రీలు లేవని మిగతా సగం కల్లంలోనే ఉంచారు. నాకు రూ. 4.80 లక్షలు రావలసి ఉంది. మొ త్తం బస్తాలు తరలిస్తేగానీ నగదు జమ కావని చెబుతున్నారు. వర్షం ఎప్పుడు పడుతుందోనని భయం వేస్తుంది. కల్లాల్లో కవర్లు కప్పి పంటను కాపాడుకుంటున్నం. ఇప్పటికైనా త్వరగా మిగ తా పంటను కూడా తరలించి, నగదు జమ చేయాలి.

Updated Date - May 29 , 2026 | 11:30 PM