Share News

కౌలు రైతు సంగతేంది...?

ABN , Publish Date - May 11 , 2026 | 11:37 PM

ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించే కౌలు రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ రెండున్న రేళ్లు గడిచినా నెరవేరడం లేదు. సార్వత్రిక ఎన్నికల హామీలో భాగంగా కౌలు రైతులకు ఏటా రూ. 15వేలు చెల్లిస్తామని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది.

కౌలు రైతు సంగతేంది...?

-రూ. 15వేలు చెల్లిస్తామన్న కాంగ్రెస్‌

-రెండున్నరేళ్లు గడిచినా ఊసే ఎత్తని ప్రభుత్వం

-యేటేటా పెరుగుతున్న కౌలు రేట్లు

-కౌలు చట్టాలు అమలైతే మూడు వేల మందికి మేలు

మంచిర్యాల, మే 11 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించే కౌలు రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ రెండున్న రేళ్లు గడిచినా నెరవేరడం లేదు. సార్వత్రిక ఎన్నికల హామీలో భాగంగా కౌలు రైతులకు ఏటా రూ. 15వేలు చెల్లిస్తామని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. అయితే రా ష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ తన హామీ అ మలు చేయకపోవడంతో కౌలు రైతుల పరిస్థితి ఎక్క డవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. కౌలు రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు రేవం త్‌రెడ్డి ప్రభుత్వం ఒక దశలో కసరత్తు ప్రారంభించిన ప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. భూములు లేని ఈ పేద రైతులకు ఇంతకాలం ప్రభుత్వాలు రిక్తహస్తం చూపగా, ఆదుకుంటామన్న కాంగ్రెస్‌ సైతం అదే దారి లో పయనిస్తోంది. భూ యజమానులు సాగు చేయక వదిలేస్తే, ఆ బీడు భూముల్లో తమ సేద్యంతో పంటలు పండిస్తున్న ఎంతో మంది కౌలు రైతులు దుర్భర జీవి తాలు గడుపుతున్నారు. చీడపీడల కారణంగా పంటలు దెబ్బతిన్నా, చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు, ఇ తరత్రా ప్రకృతి విపత్తులతో నష్టపోయినా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భూ యజమానికి కౌలు శిస్తు చెల్లించాల్సిందే. కాంగ్రెస్‌ హామీ అమలైతే కౌలు రైతులకు మళ్లీ మంచి రోజులు వచ్చే అవకా శాలు ఉన్నాయి.

యేటా పెరుగుతున్న రేట్లు....

భూముల కౌలు రేట్లు ప్రతియేటా పెరుగుతుండ టంతో రైతులపై అధిక భారం పడుతోంది. ప్రస్తుతం నీటి వసతులు ఉన్నచోట ఎకరా భూమికి సంవత్సరానికి రూ. 20వేల పైచిలుకు ధరలు పలుకున్నాయి. నీటి వసతులు తక్కువగా ఉన్నచోట రూ. 12వేల నుంచి రూ. 15వేల వరకు యజమానులు వసూలు చేస్తున్నా రు. కొంతకాలంగా కౌలు రేట్లను పరిశీలిస్తే దాదాపు మూడు రెట్లు పెరిగాయి. 2015లో 8వేలు, 2016లో 9 వేలు, 2017లో 10వేలు, 2018లో రూ. 12వేలు ఉం డగా, 2019లో రూ. 13వేలు, 2020లో 14వేలు, 2021లో 14వేలు, 2022లో రూ. 15వేలు ఉండగా 2023 నుంచి ఇప్పటి వరకు ఏటేటా పెరుగుతున్నాయి. పంట దిగుబ డితో సంబంధం లేకుండా అగ్రిమెంటు ప్రకారం భూ ముల యజమానులకు కౌలు రైతులు పై రేట్లు చెల్లించాల్సి వస్తోంది.

పెట్టుబడులూ అధికమే...

పంటలు పండించేందుకు కౌలు రైతులు పెట్టే పెట్టుబడులు సైతం అధికంగానే ఉంటున్నాయి. ఎకరా వి స్తీర్ణం సాగు చేసేందుకు ఖర్చులు రూ. 30వేల వరకు అవుతున్నాయి. ట్రాక్టర్‌ కిరాయి రూ. 6 వేలు వెచ్చించాల్సి వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. అలాగే నా టు వేయడానికి రూ. 5 వేలు, ఎరువుల కోసం రూ. 6 వేలు, కలుపు తొలగించేందుకు రూ. 2 వేలు, పంట సమయంలో కోత మెషీన్‌కు గంటకు రూ. 2000 చె ల్లిస్తున్నారు. ఈ లెక్కన ఎకరా సాగు చేసేందుకు రైతులు సగటున రూ. 30 వేలకుపైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. పెట్టుబడులు కూడా ప్రతి సంవత్సరం పె రుగుతుండటంతో కౌలు రైతు అధిక భారం మోయక తప్పడంలేదు. అలాగే ఎరువుల ధరలు సగటున రూ. 300 వరకు పెరిగినట్లు రైతులు వాపోతున్నారు. 2017 సంవత్సరం వరకు జిల్లాలో 300 మంది కౌలు రైతులు ఉండగా 172 మందికి ప్రభుత్వపరంగా గుర్తింపు కా ర్డులు అందజేశారు. రూ. 3 లక్షల వరకు రుణం మం జూరు చేశారు. అనంతరం కౌలు రైతు గుర్తింపు కార్డు లను ప్రభుత్వం రద్దు చేయగా, బ్యాంకులు రుణాలు ని లిపి వేశాయి. దీంతో పంట పెట్టుబడుల కోసం ప్రైవే టు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి, నిలువు దోపిడీకి గురవుతున్నారు.

చట్టాలు చచ్చు బండలు...

కౌలు రైతులకు ప్రభుత్వపరంగా గుర్తింపునిచ్చి, వా రికి సహాయ సహకారాలు అందించేందుకు అప్పటి ఉ మ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ లైసెన్స్‌డ్‌ కల్టివేటర్స్‌ రూల్స్‌-2012 చట్టం అమల్లో ఉండేది. అయితే బీ ఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత చట్టం పూర్తిగా చ చ్చుబడి పోయింది. 2016-17 వరకు చట్టాన్ని అమలు చేసిన ప్రభుత్వం ఆ తరువాత సంవత్సరం నుంచి దా న్ని పట్టించుకోలేదు. చట్టంలో భాగంగా రెవెన్యూ అధికారులు కౌలు రైతులకు వ్యవసాయ సాగుకోసం గు ర్తింపు కార్డులు అందజేసేవారు. గ్రామ పంచాయితీ కార్యాలయాలవద్ద రైతుల వివరాలు నమోదు చేయబడి ఉండేవి. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు పొం దేందుకు అర్హత కార్డులు ఉండేవి. క్రాపు లోన్‌ మినహాయించి ఇతరత్రా రుణాలు పొందేందుకు ఇవి ఉపయోగపడేవి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కౌలు రైతుల గుర్తింపు ను రద్దు చేయడంతో ప్రభుత్వపరంగా వీరికి ఎలాంటి సహాయ సహకారాలు అందడంలేదు. బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక రుణమాఫీ ప్రకటించి, రై తు బంధు పథకం కింద ఎకరానికి ఏటా రూ. 8వేలు అందించినా... భూ యజమానికే తప్ప కౌలు రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగ లేదు. ఈ క్రమంలో రాష్ట్ర సర్కారు స్పందించి, తమనూ రైతు బంధు పథకం పరి ధిలోకి తెచ్చి, పెట్టుబడి సాయం అందజేయాలని కౌలు రైతులు విజ్ఞప్తి చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకో లేదు. కౌలు రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అయినా ఆ దిశగా చర్యలు చేపట్టా లనే విజ్ఞప్తులు ఉన్నాయి.

Updated Date - May 11 , 2026 | 11:37 PM