సర్వేయర్ల సంగతేంది.. ?
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:04 PM
భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఎంపిక చేసిన లైసెన్సుడ్ సర్వేయర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రవేశ పరీ క్షలు నిర్వహించి వారికి శిక్షణనిచ్చి గత సంవత్సరం అక్టోబ ర్ 19న సీఎం చేతుల మీదుగా లైసున్సులు అందజేశారు. మండలానికి మూడు నుంచి నాలుగురిని కేటాయించిన ప్పటికీ వారికి జీతభత్యాలు మాత్రం ఇవ్వడం లేదు.
-శిక్షణ తీసుకొని లైసెన్సు పొందినా ప్రయోజనం శూన్యం
-మండలాలు కేటాయించినప్పటికి జీతభత్యాలపై స్పష్టత కరువు
-ముందుకు సాగని భూభారతి సర్వే పనులు
-మార్గదర్శకాల కోసం ఎదురు చూపులు
నెన్నెల, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఎంపిక చేసిన లైసెన్సుడ్ సర్వేయర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రవేశ పరీ క్షలు నిర్వహించి వారికి శిక్షణనిచ్చి గత సంవత్సరం అక్టోబ ర్ 19న సీఎం చేతుల మీదుగా లైసున్సులు అందజేశారు. మండలానికి మూడు నుంచి నాలుగురిని కేటాయించిన ప్పటికీ వారికి జీతభత్యాలు మాత్రం ఇవ్వడం లేదు. తా ము జీతాలు లేకుండా ఎన్నిరోజులు వెట్టి చాకిరి చేయాలని ప్రశ్నిస్తున్నారు. లైసెన్సులు పొంది నెలలు గడుస్తున్నా సర్వే యర్ల సేవల వినియోగంలో అనిశ్చితి కొనసాగుతోంది. జీత భత్యాలపై మార్గదర్శకాలు జారీ కాకపోవడంతో వారంతా ఇలాగే వేచిచూస్తూ రోజులు గడపాలా.. ప్రత్యామ్నాయం చూసుకోవాలా అనే డైలమాలో ఉన్నారు.
-మంచి ఉద్యోగాలు వదులుకొని..
చాలా మంది యువకులు రెవెన్యూ శాఖ పరిధిలో పని చేయడమంటే ఆర్థిక భరోసా, మంచి భవిష్యత్తు ఉంటుం దని భావించి సాఫ్ట్‌వేర్, ప్రైవేటు ఉద్యోగాలు, మంచి ఉపా ధి అవకాశాలను వదులుకొని ప్రవేశ పరీక్ష రాసి సర్వేయ ర్‌గా సెలెక్ట్ అయ్యారు. డిజిటల్ కొలతలపై శిక్షణ, అప్రెంటి స్‌షిప్ కూడా తీసుకున్నారు. రెండు విడుతల్లో దాదాపు జి ల్లా నుంచి 200 మంది సర్వేయర్లుగా శిక్షణ పొందారు. వా రందరికీ లైసెన్సులు అందజేశారు. మండలాలు కేటాయిం చారు. తహసిల్దార్‌లకు రిపోర్టు కూడా చేశారు. ఇక తమ భవిష్యత్తుకు డోకా లేదనుకున్న వారందరికీ చుక్కెదురవు తోంది. భూముల డిజిటల్ సర్వే కోసం ఒక్కో సర్వేయర్‌కు రూ. 20వేలు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం సర్వే చేసి మ్యాప్ అందించేందుకు విస్తీర్ణాన్ని బట్టి రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు ఇస్తారని ప్రచారం జరిగింది. భూమి కొనుగోలు దారు నుంచి వసూలు చేసే ఫీజు లో కొంత శాతం సర్వేయర్లకు ప్రభుత్వం చెల్లిస్తుందని కూడా చెప్పారు. నెలలు గడుస్తున్నా సరైన పని చూపడం లేదు. ఒక్క రూపాయి చెల్లించడంలేదు. 2 వేల ఎకరాలకు సంపూ ర్ణంగా సర్వే చేస్తే రూ. 40 వేలు ఇస్తామని ప్రభుత్వం సూ చనప్రాయంగా ప్రకటించింది. ఇద్దరు సర్వేయర్లు ఆరు నెల లు సర్వే చేస్తే (ఎలాంటి భూ సమస్యలు, చిక్కులు లేని పక్షంలో) కూడా సర్వే పూర్తి కాదని అంటున్నారు. అంటే నె లకు ఒక్కరికి మూడు వేలు కూడా రావంటున్నారు. కొంద రికి ఇతర మండలాలను కేటాయించారు. అక్కడికి వె ళ్లేందుకు రవాణా భత్యం కూడా ఇవ్వడం లేదు. నెలల తర బడి జీతభత్యాలు లేకుండా వెట్టిచాకిరి చేయడానికే తమకు లైసున్సులు ఇచ్చినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొలతల కోసం వాడే డీజీపీఎస్ యంత్రాలు తాము కొను క్కోవాలా.. ప్రభుత్వమే ఇస్తుందా అనే అంశంపై కూడా స్ప ష్టత లేదు. ప్రభుత్వం ఏది తేల్చకపోవడంతో చాలా మంది కార్యాలయాలకు రావడం మానుకున్నారు. ఇప్పటికైన తమ కు ఉద్యోగ భద్రత కల్పించి తమ సేవలు వినియోగించు కోవాలని లైసెన్స్‌డ్ సర్వేయర్లు కోరుతున్నారు. మరోవైపు సంఘటితంగా పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పాటి కే రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాస్, సెక్రటరీ రాజీవ్ గాంధీ హన్మంతు, కేటీఆర్, హరీష్‌రావు, తీన్మార్ మల్లన్న తదితరులను కలిసారు. తమ సమస్యలను విన్నవించు కు న్నారు. కార్యచరణ రూపొందించి దశల వారీగా ఆందోళన లు చేస్తామని చెబుతున్నారు.
పైలెట్ ప్రాజెక్టు గ్రామాల్లో సాగని పనులు
భూభారతి చట్టంలో భాగంగా భూ పట్టాలు లేని గ్రా మాలకు నక్షాలు రూపొందించడంతో పాటు, సర్వే నంబర్ల వారిగా టీపన్‌లు రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇందులో భాగంగానే నక్షాలు లేని గ్రామాల్లో రిసర్వే నిర్వహించి కమతాల వారిగా హద్దులు నిర్ణయించాల్సి ఉం ది. సరిహద్దులు పక్కాగా తేల్చేందుకు ప్రయోగాత్మకంగా కొ న్ని గ్రామాల్లో రిసర్వే చేయాల్సిఉంది. జిల్లాలోని చిన్న వెం కటాపూర్, తంగళ్లపల్లి, రాంపూర్, కొత్తపల్లి, పుప్పాల్‌వాని పే ట, అడ్కపల్లి, కిష్టంపేట, కవర్ కొత్తపల్లి, పార్‌పెల్లి, మద్ది కల్, చెన్నూరు, ఆరెపల్లి గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. డ్రోన్, డీజీపీఎస్ (డిఫరెన్షియల్ గ్లోబల్ పొ జీషనింగ్ సిస్టం)తో సర్వే చేపట్టనున్నారు. హద్దులు గుర్తిం చి గ్రామకంఠం, అటవీ, సర్కారు, దేవాదాయ, సీలింగ్, పడా వు తదితర భూములతో పాటు వ్యయసాయ భూములను సర్వేనంబర్ల వారిగా నక్షా, టిప్పన్ రూపొందిస్తారు. సర్వే యర్లు రాక పోవడంతో ప్రయోగాత్మకంగా సర్వే చేపట్టాల్సి న గ్రామాల్లోనే పనులు ముందుకుసాగడం లేదు.
-ఎక్కడి సమస్యలు అక్కడే..
రెవెన్యూశాఖలో అధిక శాతం సర్వేతో అనుసంధానమైన సమస్యలే ఉన్నాయి. సరిహద్దులు సరిగ్గా లేక పోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. జిల్లాలో వివిధ రెవె న్యూ గ్రామాలకు సంబంధించిన సరైన మ్యాపులు అఽధికారు ల వద్ద లేకపోవడం సమస్యగా మారింది. కొన్ని గ్రామాలకు పూర్తిగా నక్షాలే లేవు. భూ పట్టాలు లేని గ్రామాలకు నక్షా లు రూపొందించడంతో పాటు, సర్వే నంబర్ల వారిగా టీపన్ లు రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ డివిజన్‌కు ఒక్కరిద్దరు మాత్రమే రెగ్యులర్ సర్వేయర్లు ఉ న్నారు. వారితో పనులు సాగడం లేదు. కొత్తగా లైసెన్సుడ్ సర్వేయర్లు వస్తే అవన్నీ ఓ కొలిక్కివస్తాయని భావించి నప్పటికి అడుగు ముందుకు పడటం లేదు. జిల్లాలో పట్టా భూములతో పాటు పోడు భూములు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, అసైన్డ్ భూములు ఉన్నాయి. రెవెన్యూ, అటవి శాఖల మధ్య భూవివాదం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అంటూ అసైన్డ్ చేసి పట్టాలు జారీ చేస్తుండగా, ఆ భూములు రిజర్వు ఫారెస్టుకు చెందిన వి అంటూ అటవిశాఖ అధికారులు సాగును అడ్డుకుంటూ కేసులు నమోదు చేస్తున్నారు. రెవెన్యూ, ఫారెస్టు శాఖలు జాయింట్ సర్వే నిర్వహించాలనే డిమాండ్ దశాబ్దాల నుం చి ఉంది. ఇంతే కాకుండా భూభారతి చట్టం అమలు కోసం గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణంలో మార్పులు వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. ప్రజావాణిలో భూసమస్యలపై పదుల సంఖ్యలో వినతి పత్రాలను అందిస్తూనే ఉన్నారు. సర్వేయర్లు విధుల్లో చేరితే ఈసమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.