Share News

kumaram bheem asifabad- కల్యాణ వైభోగమే..

ABN , Publish Date - Nov 15 , 2026 | 10:44 PM

శుభఘడి యలు లేక ఇన్నాళ్లు బోసిపోయిన పెళ్లి పందిళ్లు మళ్లీ కళకళలాడుతున్నాయి. శుభకార్యాలకు అనుకూలమైన రోజులు లేక వేచిచూస్తున్న కుటుంబాలకు కార్తీకమాసం కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ నెల 10న కార్తీకమాసం ప్రారంభం కాగా 12వ తేదీ నుంచి వివాహ ముహూర్తాలు మొదలయ్యాయి. దీంతో పెళ్లి ళ్లు ఖరారు చేసుకునేందుకు కుటుంబాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇ

kumaram bheem asifabad- కల్యాణ వైభోగమే..
లోగో

- కార్తీకంలో మొదలైన పెళ్లి సందడి

బెజ్జూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): శుభఘడి యలు లేక ఇన్నాళ్లు బోసిపోయిన పెళ్లి పందిళ్లు మళ్లీ కళకళలాడుతున్నాయి. శుభకార్యాలకు అనుకూలమైన రోజులు లేక వేచిచూస్తున్న కుటుంబాలకు కార్తీకమాసం కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ నెల 10న కార్తీకమాసం ప్రారంభం కాగా 12వ తేదీ నుంచి వివాహ ముహూర్తాలు మొదలయ్యాయి. దీంతో పెళ్లి ళ్లు ఖరారు చేసుకునేందుకు కుటుంబాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే కొందరు వివాహ తేదీలను నిర్ణయించుకోగా, మరికొందరు పండితులను సంప్రది స్తూ ముహూర్తాల వివరాలను తెలుసుకుంటున్నారు. బంధుమిత్రుల ఆహ్వానాలు, పెళ్లి పనులు, వేదికల ఎంపికతో ఇళ్లల్లో సందడి వాతావరణం నెలకొంటు న్నది. కార్తీకమాసం అంటేనే శుభకార్యాలకు పెట్టింది పేరు. ఈ మాసంలోనే అధికంగా వివాహాలు, నూతన గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలు చేపడతారు.

- పెద్ద ఆడంబరమే..

పెళ్లి అంటే పెద్ద ఆడంబరమే. వివాహ నిశ్చయ తాంబూలాల నుంచి ప్రీ వెడ్డింగ్‌, పెళ్లి, పెళ్లి తర్వాత తంతు అంటూ అనేక రకాలుగా వివాహ సంబరాన్ని తాకేలా నిర్వహిస్తారు. ప్రస్తుతం కార్తీక మాసంలో వివాహాల సీజన్‌ మొదలు కావడంతో అనుబంధ వ్యాపారాలు పుంజుకున్నాయి. పెళ్లిళ్లకు అవసరమైన బంగారు, వెండి ఆభరణాలు, పట్టు వస్ర్తాలు, ఇతర దుస్తుల కొనుగోళ్లు పెరగనున్నాయి. కల్యాణ మండ పాల అలంకరణలు, పూల మాలలు, విద్యుద్ధీపాలు, వంటకాల ఏర్పాట్లకు డిమాండ్‌ ఏర్పడనుంది. ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు, క్యాటరింగ్‌ నిర్వాహ కులు, డెకరేటర్లు ముందస్తు ఆర్డర్లతో బిజీ కాను న్నారు. పురోహితులు, మంగళవాయిద్య కళాకారులకు వరుసగా కార్యక్రమాలు ఉండను న్నాయి. ఒక పెళ్లి వేడుక చుట్టూ అనేక వృత్తులు, వ్యాపారాలు ముడిపడి ఉండటంతో ఈ సీజన్‌ వారికి ఆదాయాన్ని సమకూర నుంది. దీంతో పాటు కిరాణా దుకాణాలకు కూడా గిరాకీ పెరిగే అవకాశం ఉంటుంది. కార్తీకమాసం వివాహాల సీజన్‌ కారణంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది.

- హిందూ సంప్రదాయంలో..

కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో విశిష్టమె ౖనది. శివకేశవులకు ప్రీతికరమైన మాసంగా భావిస్తూ భక్తులు ప్రత్యేక పూజలు, దీపారాధనలు నిర్వహిస్తారు. కార్తీక సోమవారాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలా డుతాయి. శుభకార్యాల నిర్వహణకు అనుకూలమైన ముహూర్తాలు ఉండడంతో కుటుంబాలు వేడుకలకు సిద్ధమవుతున్నారు. వివాహాలే కాకుండా ఇతర కార్యక్ర మాలు చేస్తుంటారు. సాంప్రదాయాలకు అనుగుణంగా కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వేడుకలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకుం టున్నారు. కాగా పంచాంగ వివరాల ప్రకారం నవంబ రు నెలలో16, 18, 20, 21, 22, 25, 26, 27తేదీల్లో వివాహాలకు లనుకూలమైన ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబరులో 3, 4, 10, 14, 16, 19, 20, 23, 24, 25, 28, 30తేదీల్లో శుభ ఘడియలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. వరుసగా ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్ల తేదీలు ఖరారుతో పాటు కళ్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాళ్ల బుకింగ్‌లు ఊపందుకుం టున్నాయి. ముఖ్యమైన తేదీల్లో వేదికలు దొరకడం కష్టమవు తుందనే ఉద్దేశంతో ముందుగానే రిజర్వు చేసుకుం టున్నారు. మొత్తంగా నవంబరు, డిసెంబరు నెలలు పెళ్లి వేడుకలతో సందడిగా మారనున్నాయి. తెలుగు రాష్ర్టాల్లో శుభకార్యాలను ఎక్కువగా కార్తీకమాసంలో చేసేందుకే ఇష్టపడతారు. ఈ మాసం శుభకార్యాలకు తోడు ఆధ్యాత్మికతకు కూడా పెట్టింది పేరు కావడం తో హిందువుల్లో ఎక్కువ శుభకార్యాలు చేస్తారు.

Updated Date - Nov 15 , 2026 | 10:44 PM