కాళ్లు మొక్కుతాం.. ధాన్యం కొనండి సార్
ABN , Publish Date - May 08 , 2026 | 10:55 PM
కాళ్లు మొక్కు తాం కనికరించండి సార్.. పుణ్యముంటది ధాన్యం కొని మా ఇబ్బందులు తొలగించండి సార్ అంటూ.. అన్న దాతలు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య కాళ్లపై పడి శుక్రవారం వేడుకున్నారు.
అదనపు కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్న రైతులు
రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో
హాజీపూర్, మే 8 (ఆంధ్రజ్యోతి) : కాళ్లు మొక్కు తాం కనికరించండి సార్.. పుణ్యముంటది ధాన్యం కొని మా ఇబ్బందులు తొలగించండి సార్ అంటూ.. అన్న దాతలు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య కాళ్లపై పడి శుక్రవారం వేడుకున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తూకం వే యకపోవడం, మిల్లులకు తరలించడంలో జాప్యాన్ని నిరసిస్తూ మండలంలోని పెద్దంపేట, టీకనపల్లి, హాజీ పూర్, కర్ణమామిడి, పడ్తనపల్లి గ్రామాలకు చెందిన రై తులు శుక్రవారం హాజీపూర్ మండల కేంద్రంలో 63వ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టా రు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, రైతులను కాపాడాలని, కలెక్టర్ వచ్చి న్యాయం చయాలని నినా దాలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సార్ మా వడ్లు కొ నండి మమ్మల్ని ఆదుకోండి అంటూ రైతులు చేసిన విజ్ఞప్తులు అక్కడు న్న వారిని కంటతడిపెట్టించాయి. సుమారు రెండు గంటల పాటు సాగిన రాస్తారోకోతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపో యాయి. సమాచారం అందుకున్న హాజీపూర్ ఎస్‌ఐ కిరణ్‌కుమార్ వద్దకు చేరుకుని రైతులను సముదా యించే ప్రయత్నం చేశారు. గంటలోపు అధికారులు, లారీలు కొనుగోలు కేంద్రాలకు చేరుకుంటారని, ధాన్యం తరలింపు ప్రారం భమవుతుందని హామీ ఇచ్చినా రైతులు వెనక్కి తగ్గలేదు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా జిల్లా అడిషనల్ కలెక్టర్ అక్కడకు చేరుకుని రైతులతో మాట్లడారు. ఈ సందర్భంగా రైతు లు తమ గోడును వెళ్లగక్కు తూ అధికారుల కాళ్లపై పడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఏడాది పొడవునా పండించిన ధాన్యం కళ్లముందే పాడైపోతుందని, మ మ్మల్ని ఆదుకోవాలని వేడుకున్నారు. రైతుల ఆవేదనను విన్న అడిషనల్ కలెక్టర్ సమస్య పరిష్కా రానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. ఇప్పటికే రైసు మిల్లర్లు, కాంట్రాక్టర్లతో మాట్లాడినట్లు ఆయన వెల్లడిం చారు. లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియ లో ఇబ్బందులు తలెత్తకుండా హమాలీలను, అదనపు సిబ్బందిని అం దుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. తడిసిన ధా న్యంపై రైతులు ఆందోలన చెందవద్దని, ఆరబెట్టిన త ర్వాత ప్రతి గింజను కొంటామని స్పష్టం చేశారు. మొదటి వారం రోజులు సాంకేతిక కారణాలతో జాప్యం జరిగినప్పటికీ ఇకపై కొనుగోలు ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. అడిషనల్ కలెక్టర్ హామీతో కొంత ఊరట చెందిన రైతులు నిరసనను విరమించారు. హామీలు అమలు కాకపోతే మళ్లీ రోడ్డెక్కుతామని రైతులు హెచ్చరించారు.