ఓటు లేకపోతే సంక్షేమ పథకాలు బంద్
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:09 PM
ఓటు లేకపోతే భ విష్యత్‌లో సంక్షేమ పథకాలు కోల్పోయే అవకాశం ఉందని, ప్రతీ ఒక్క ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్ రావు అన్నారు.
ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
మంచిర్యాల క్రైం, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : ఓటు లేకపోతే భ విష్యత్‌లో సంక్షేమ పథకాలు కోల్పోయే అవకాశం ఉందని, ప్రతీ ఒక్క ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్ రావు అన్నారు. ఆయన ని వా సంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 24లోపు ప్రతీ ఒక్కరూ ఓటు నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 35 శాతం మున్సిపల్ కార్పొరేషన్‌లో, గ్రామపంచా యతీల్లో 50 శాతం నమోదైందన్నారు. ఈ నెల 19 వ తేదీలోగా పూర్తి చేసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థి తుల్లో నమోదు ప్రక్రియ పెంచే అవకాశం లేద న్నా రు. ఓటుహక్కు లేకుంటే పెన్షన్, ఉచిత కరెంటు బి ల్లు, మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలు కో ల్పోయే అవకాశం ఉందన్నారు. ఓటర్లు నిర్లక్ష్యం చూపకుండా తమ ఓటును కాపాడుకోవాలని ఆయ న సూచించారు. నియోజకవర్గంలో బీఎల్‌వో, బీ ఎల్‌ఏలతో పాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పం చులు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ప్రక్రియ ను పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్య క్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల స త్యనారాయణ, మేయర్ దరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు తూ ముల నరేష్, కార్పొరేటర్లు, అధ్యక్షుడు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.