సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - May 05 , 2026 | 11:33 PM
కార్మికశాఖ అందిస్తున్న సంక్షేమ పథ కాలను అర్హులైన ప్రతీ కార్మికుడు సద్విని యోగం చేసుకోవాలని జిల్లా అసిస్టెంట్ లేబర్ అధికారి రాజ్‌కుమార్ సూచించారు.
- జిల్లా అసిస్టెంట్ లేబర్ అధికారి రాజ్‌కుమార్
నాగర్‌కర్నూల్ టౌన్, మే 5 (ఆంధ్రజ్యో తి) : కార్మికశాఖ అందిస్తున్న సంక్షేమ పథ కాలను అర్హులైన ప్రతీ కార్మికుడు సద్విని యోగం చేసుకోవాలని జిల్లా అసిస్టెంట్ లేబర్ అధికారి రాజ్‌కుమార్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ మీసే కేంద్రంలో భవన నిర్మాణం, ఇతర రంగాల కార్మికులకు లేబర్ గుర్తింపు కార్డు కోసం ద రఖాస్తు విధానం, సంక్షేమ పథకాలపై అవ గాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాల ద్వారా అనేక ప్రయోజ నాలు పొందే అవకాశం ఉందన్నారు. ప్రతీ కార్మికుడు తప్పని సరిగా లేబర్ గుర్తింపు కార్డు పొందాలని, దీంతో ప్రమాద భీమా, వైద్య సహాయం, ప్రసూతి సహాయం వంటి పలు సంక్షేమ పథకాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. జిల్ల్లా లేబర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ యాదగిరిస్వామి, మీసేవా నిర్వహ కులు తదితరులు పాల్గొన్నారు.