Share News

kumaram bheem asifabad- అర్హులకు సంక్షేమ పథకాలు అందజేయాలి

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:04 AM

అర్హులకు సంక్షేమ పథకాలు అందజేయాలని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగాంగా ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి జాయింట్‌ కలెక్టర్‌ డేవిడ్‌తో కలిసి హాజరై మాట్లాడారు.

kumaram bheem asifabad- అర్హులకు సంక్షేమ పథకాలు అందజేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దండె విఠల్‌

పెంచికలపేట, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): అర్హులకు సంక్షేమ పథకాలు అందజేయాలని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగాంగా ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి జాయింట్‌ కలెక్టర్‌ డేవిడ్‌తో కలిసి హాజరై మాట్లాడారు. పారిశుధ్యం, ఆరోగ్య, విద్య, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలానికి ముందు డ్రైనేజీ శుభ్రత, చెత్త సేకరణ, దోమల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజా సమస్యలను త్వరిగతిన పరిష్కరించి అర్హులందరికి పథకాలు అందేలా చూడాలన్నారు. పెండింగ్‌ పనులు పూర్తి చేయడం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులు చేపట్టాలని, మండలంలో జూనియర్‌ కళాశాల, క్రీడామైదానం ఏర్పాటు కోసం కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఇసుక రవాణా సమస్య, పోడు భూముల అంశాలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తే మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్‌ తిరుపతి, ఎంపీడీఓ మహేందర్‌, ఎస్సై అనీల్‌కుమార్‌ తదితరులు ప

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

జైనూర్‌/సిర్పూర్‌(యు), ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం కోట్ల రూపాయి ఖర్చు చేస్తోందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడ్మేత విశ్వనాథ్‌రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మార్కెట్‌ కమిటీ యార్డులో ప్రజా పాలన ప్రజా ప్రణాళిక సమావేవంలో ఆయన మాట్లాడారు. ప్రజా పాలన ప్రజా ప్రణాళిక మండల సమావేశానికి కొన్ని శాఖల అధికారుల గైర్హాజరు కావడం సరికాదని చెప్పారు. .ఆయా గ్రాయ పంచాయతీలలో ప్రజా పాలన ప్రజా ప్రణాళిక సమావేశాలు సక్రమాంగా నిర్వహించడం జరిగిందన్నారు.గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కారించడానికి ప్రాధాన్యాత ఇవ్వడం జరిగిందన్నారు.ఆయా సమస్యలను పరిష్కారించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.అదే విధంగా సిర్పూర్‌(యు)లో ప్రజా పాలన ప్రజా ప్రణాళిక సమావేశం నిర్వహించారు.ప్రజల నుంచి సమస్యలను పరిష్కారిండానికి చర్యలు తీసుకుంటామని మండల ప్రత్యేక అధికారి భాస్కర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్‌ రెడ్డి, తహసీల్దార్‌ ఆడ భీర్‌షా, ఎస్సై రవికుమార్‌, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను డీపీవో భిక్షపతి గౌడ్‌ వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకరమ్మ, సర్పంచ్‌లు భరద్వాజ్‌, బాబురావు, వెంకటేష్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

కౌటాల (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల సభ న్విహించారు. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారాం, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దేవయ్య, తహసీల్దార్‌ రమేష్‌, ఎంపీడీవో ప్రసాద్‌, చంద్రశేఖర్‌, సర్పంచ్‌ తదితరులు పాల్గొని ప్రజా సమస్యల తదితర విషయాలను చర్చించి అభివృద్ధి పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): మారు మూల ప్రాంతాల ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని ఆత్మా చైర్మన్‌ టి.శ్రీరామరావు అన్నారు.మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలు గుర్తించి పరిష్కరించాలన్నారు. రైతులు సాగు చేసే పంటలపై ప్రారంభం నుంచే అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందేటట్లు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి అశోక్‌, తహసీల్దార్‌ మునావర్‌ షరీఫ్‌, ఎస్సై రమేష్‌, ఎంపీడీఓ నస్రుల్లాఖాన్‌, ఎంపీఓ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి,(ఆంధ్రజ్యోతి): గ్రామ సమస్యల పరిష్కారానికి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి సమక్షంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ మండల సభ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల ప్రజాప్రతినిధులు, అధికారులు మండల సమస్యల పట్ల మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తే అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్‌ దౌలత్‌, ఏవో కార్తీషా, ఎంఈవో జయరాజ్‌, ఎస్‌ఐ నీరజ్‌, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 12:04 AM