kumaram bheem asifabad- అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలి
ABN , Publish Date - Jul 07 , 2026 | 11:10 PM
కేంద్ర ప్రభుత్వం జిల్లాలో అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించాలని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా కలెక్టర్ హరిత అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై దిశ సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు, ఐటీడీఏ పీవో మంద మకరందు. అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్‌లతో కలిసి నిర్వహించారు.
ఆసిఫాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం జిల్లాలో అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించాలని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా కలెక్టర్ హరిత అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై దిశ సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు, ఐటీడీఏ పీవో మంద మకరందు. అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్‌లతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. వాటిని క్షేత్రస్థాయిలో అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలో పనులు కేటాయింపు విషయంలో ప్రజాప్రతినిధులను సంప్రదించి అధికారులు నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామానికి ఫోన్ సిగ్నల్ ఉండేలా టవర్‌ల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. వర్షకాలం నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో కొన్ని శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన నివేదికలు సరైన సమాదానాలు వ్యక్తం చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారని చేశారు. తీరు మార్చుకోవా లంటూ హెచ్చరించారు. కలెక్టర్ హరిత మాట్లాడుతూ జిల్లాలో మ్యాన్ పవర్ తక్కువగా ఉందని వివరించారు. ఒకే అధికారికి రెండు, మూడు శాఖలు నిర్వహించాల్సి వస్తుందని ప్రస్తావించారు. దీంతో అనుకున్న సమయానికి అవసరమైన ఫలితాలు రావడంలేదని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. పోడు భూములను ఈ సంవత్సరం అటవీశాఖ అధికారులు వదిలేసి వచ్చే సంవత్సరం జాయింట్ సర్వే నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరారు. సిర్పూర్ ఎమ్మెల్యే హరిష్‌బాబు మాట్లాడుతూ టవర్‌ల నిర్మాణంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారన్నారు. కేంద్రం నుంచి వచ్చే గ్రామీణాభివృద్ధి శాఖ నిధులలో సరైన ప్రాధాన్యం తమ నియోజకవర్గానికి ఇవ్వడం లేదని తెలిపారు. సమావేశంలో డీఆర్వో వేణు, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.