Share News

kumaram bheem asifabad- అర్హులకే సంక్షేమ పథకాలు

ABN , Publish Date - May 22 , 2026 | 10:08 PM

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని అదనపు కల్టెర్‌ యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశానికి అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌, జిల్లా రెవెన్యూ అధికారి వేణు, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి పాల్గొన్నారు.

kumaram bheem asifabad- అర్హులకే సంక్షేమ పథకాలు
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌

ఆసిఫాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని అదనపు కల్టెర్‌ యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశానికి అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌, జిల్లా రెవెన్యూ అధికారి వేణు, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమపథకాలు అందిస్తామని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రైతు భరోసా, ఇందరిమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, సన్నరకం వరి ధాన్యం క్వింటాలుకు బోనస్‌, చేయూత పెన్షన్‌, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, మహిళాశక్తి బ్యాంకు లికేంజీ వడ్డి లేని రుణాలు, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ చీరలు వంటి సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించడం జరుగుతుందని, వచేచ నెలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అల్పాహారం కుటుంబ జీవిత బీమా, ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న బోజనం, దివ్యాంగ విద్యార్థులకు వాహనాలు, పంటల మార్పిడి, సేంద్రీయ వ్యవసాయం, అయిల్‌ ఫాం సాగు వంటి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటన్నారు. సర్పంచ్‌లు, అధికారులు సమన్వయంతో పని చేసి పేద వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ ముఖ్యమంత్రి సందేశంను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవ శాఖ, గృహ నిర్మాణ, విద్యుత్‌, గ్రామీణాభివృద్ధి, పౌర సరఫరాల శాఖ అధికారులు తమ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

ఇంటింటికీ తాగునీరు

జిల్లాలో జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి, గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ అధికారులు నిర్వహించిన వీసీ కార్యక్రమానికి సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలోని వీసీ హాల్‌లో నిర్వహించి వీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాఏమని అన్నారు. ప్రతి ఇంటింటికి సురక్షితమైన తాగు నీరు అందించడం గ్రామాలలో పారిశుధ్య పనులు చేపట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ వీసీలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి దత్తారావు, జడ్పీ సీఈవో లక్ష్మినారాయణ, మిషన్‌ భగీరథ ఈఈ సిద్దిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2026 | 10:08 PM