kumaram bheem asifabad- అర్హులకే సంక్షేమ పథకాలు
ABN , Publish Date - May 08 , 2026 | 10:37 PM
అర్హత గల ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాగజ్‌నగర్ ఎస్పీఎం క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అందరికి వర్తించే దశల వారిగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాలో రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారిని గుర్తించేట్టు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కాగజ్‌నగర్, మే 8 (ఆంధ్రజ్యోతి): అర్హత గల ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాగజ్‌నగర్ ఎస్పీఎం క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అందరికి వర్తించే దశల వారిగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాలో రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారిని గుర్తించేట్టు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బోరిగాం శివారులో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను పూర్తి లబ్ధిదారులకు అందించడ సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ కాగజ్‌నగర్ పట్టణానికి మొదటి విడత 630 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. మొదటి విడతలో రాని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హత గల వారికి రెండో విడతలో తప్పకుండా అందజేస్తామన్నారు. కాగజ్‌నగర్ పట్టణ అభివృద్ధికి రూ.18 కోట్లు నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు మాట్లాడుతూ ప్రాణహిత నదిపై బ్యారేజ్ నిర్మాణం చేపడితే ఈ ప్రాంతానికి సాగునీరు అందించి భూములు సస్యశ్యామలమవుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రజాప్రతినిధులు అందరు సమష్టిగా కృషి చేద్దామని అన్నారు. కాగజ్‌నగర్ పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు విడుదల చేయాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ కె హరిత, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, మున్సిపల్ చైర్‌పర్సన్ షహీన్ సుల్తానాతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎస్పీఎంను సందర్శించారు. ఈ సందర్భంగా మిల్లు ప్రతినిధులు పలువురు మంత్రికి పేప ు తయారు చేసే విధానం, భద్రత చర్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రికి పలు వినతి పత్రాలను అందజేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ కమిటి జిల్లా అధ్యక్షుడు రాంచందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోలోజు సంతోష్ కుమార్ తదితరులు మంత్రికి వినతి పత్రం అందజేశారు. అలాగే భట్టుపల్లి-జీడిచేను బీటీ రోడ్డు సమస్యను పరిష్కరించాలని సర్పంచ్ రాజేందర్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.