Share News

ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:32 PM

ప్రజా ప్రభుత్వం లో పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షే మ కార్యక్రమాలను అమలు చేస్తు న్నామని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు
ఉప్పునుంతలలో లబ్ధిదారురాలికి స్మార్ట్‌ రేషన్‌కార్డును అందజేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

- స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వం లో పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షే మ కార్యక్రమాలను అమలు చేస్తు న్నామని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట పట్టణంలో అ ర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆది వారం స్మార్ట్‌ రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతీలబ్ధిదారు నికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేందర్‌, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, మునిసిప ల్‌ కౌన్సిలర్లు రేషన్‌ డీలర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

స్మార్ట్‌ రేషన్‌కార్డులు పంపిణీ

ఉప్పునుంతల, (ఆంధ్రజ్యోతి) : మండల కేం ద్రమైన ఉప్పునుంతలలో రెవెన్యూ అధికారులు ఆదివారం ఏర్పాటు చేసిన స్మార్ట్‌ రేషన్‌కార్డుల కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, డీసీసీ అ ధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరై లబ్ధిదారు లకు స్మార్ట్‌ రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటీఎం మాదిరిగ స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్ర మంలో అధికారులు, తహసీల్దార్‌ సునీత, డీటీ రమేష్‌, నాయకులు అనంతరెడ్డి, లక్ష్మీనారాయ ణ, సర్పంచ్‌ శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 11:32 PM