kumaram bheem asifabad- మహిళలకు సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 10:34 PM
ప్రధాని మోదీ మహిళ సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నారని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. సర్‌సిల్క్‌లో గ్యాస్ పోయి వంట వినియోగించకుండా, నూనె వస్తువులను వాడకుండా తయారు చేసే వంటకాలపై ఆదివారం బీజేపీ మహిళ మోర్చా ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు.
కాగజ్‌నగర్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ మహిళ సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నారని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. సర్‌సిల్క్‌లో గ్యాస్ పోయి వంట వినియోగించకుండా, నూనె వస్తువులను వాడకుండా తయారు చేసే వంటకాలపై ఆదివారం బీజేపీ మహిళ మోర్చా ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వీదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారని చెప్పారు. ఇందుకు మహిళలు స్పందించి ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకులు సిరిమల్ల మంజుల, కౌన్సిలర్ గజ్జల లావణ్య, మాజీ కౌన్సిలర్ స్రవంతబాయి, సామాజిక సేవకులు స్వాతి డాకుల్కర్, అన్నపూర్ణ, సరోజ, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): బాధితులకు పరిహారం అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హరీష్‌బాబు అన్నారు. మండలంలోని గూడెం, బూర్గుడ గ్రామాల్లో రెండు రోజుల క్రితం వాన బీభత్సానికి ఇళ్ల్లు దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలుసుకుని బాధితులను ఆదివారం ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు పరిహారంతో పాటు ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. అనంతరం గూడెం గ్రామంలో నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు. సబ్ స్టేషన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కర్జవెల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ఎమ్మెల్యేను కలిసి గ్రామంలో అటవీ అధికారులు భూములు స్వాధీనం చేసుకుంటున్నారని చెప్పారు. తాము ఎన్నో ఏళ్లుగా ఈ భూములపై ఆధార పడి జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ శాఖాధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని ఎవరు అధైర పడోద్దని సూచించారు. ఇప్పటికే సమస్యను రాష్ట్ర స్థాయిలో అధికారులను కలిసి వివరించానని రైతులకు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మల్లయ్య, నానయ్య, మురళీ, పవన్, నవీన్, బాలయ్య, పోశయ్య, రంగన్న, తుకారాం తదితరులు పాల్గొన్నారు.