Share News

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

ABN , Publish Date - Nov 15 , 2026 | 10:50 PM

అర్హులైన ప్ర తీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ మాజీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే సతీమణి కొక్కిరాల సురేఖప్రేంసాగర్‌రావు అన్నారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

ఫించన్ల మంజూరు పత్రాలను అందజేస్తున్న జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

దండేపల్లి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్ర తీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ మాజీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే సతీమణి కొక్కిరాల సురేఖప్రేంసాగర్‌రావు అన్నారు. ఆది వారం మండలంలోని మ్యాదరిపేటలో నిర్వహించిన ప్ర జాపాలనలో భాగంగా చేయూత పింఛన్ల మంజూరు ప త్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పేదలు కుటుంబ స భ్యులపై ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించాలనే గొప్ప లక్ష్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయూత పింఛన్లను అందిస్తోందన్నారు. పేదలు ఆర్ధికంగా ఇబ్బందులు పడ కుండా ప్రభుత్వమే విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధా న్యతనిస్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలైన ఇందిరమ్మ ఇండ్లు, డిజిటల్‌ రేషన్‌ కార్డులు, సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంట్‌ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. రాష్ట్రం లో మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ది చేసి ఆదర్శవంత నియోజకవర్గంగా మార్చడమే ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు లక్ష్యమన్నారు. ఇప్పటికీ ఆలయాల అభి వృద్ధి, విద్య, వైద్యపై కోట్లాది రూపాయాల నిధులు మం జూరు చేసిన ఘనత ఎమ్మెల్యేదే అన్నారు. నియోజకవ ర్గం ప్రజల అభ్యున్నతి కోసం, వారి సంక్షేమం కోసం అ హర్నిషలు కృషి చేస్తున్నామన్నారు. దండేపల్లి మండలా నికి నూతనంగా 661 చేయూత పింఛన్ల మంజూరు చే స్తామన్నారు. కార్యక్రమంలో లక్షెట్టిపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్ల, సహకార సంఘం చైర్మన్‌ శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ శంకరయ్య, ఆర్‌జీపీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు త్రిమూర్తి, మాజీ ఎంపీపీ శకుంతల, ఎంపీడీవో ప్రసాద్‌, ఐకేపీ ఏపీఎం లక్ష్మి, సర్పంచులు అనూష, కల్యాణి, రవళి, శంకరమ్మ, కళావతి, సుగుణ, తిరుపతి, మహేష్‌,ఽ దర్మ య్య, సత్యనారాయణ, నగేష్‌, రాజమల్లు, ఉప సర్పంచు లు, ఏఎంసీ డైరెక్టర్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌, కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 10:50 PM