Share News

సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా ముందుకు

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:05 AM

సంక్షేమం, అ భివృద్ధి రెండింటినీ సమాం తరంగా ముందుకు తీసు కెళ్తున్నామని ప్రభుత్వవిప్‌ ఆదిశ్రీనివాస్‌ అన్నారు. చం దుర్తి మండల కేంద్రం లోని రైతు వేదికలో సోమవారం ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ము ఖ్యఅతిథిగా

సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా ముందుకు

చందుర్తి జూలై 20 (ఆంధ్రజ్యోతి): సంక్షేమం, అ భివృద్ధి రెండింటినీ సమాం తరంగా ముందుకు తీసు కెళ్తున్నామని ప్రభుత్వవిప్‌ ఆదిశ్రీనివాస్‌ అన్నారు. చం దుర్తి మండల కేంద్రం లోని రైతు వేదికలో సోమవారం ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ము ఖ్యఅతిథిగా పాల్గొని 45 మంది లబ్ధిదారులకు 12లక్షల 59వేల విలువగల ముఖ్య మంత్రి సహా యనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమాన ప్రాధాన్యంతో ముందుకు తీసుకె ళ్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెం టీల్లో ఇప్ప టికే ఐదు గ్యారెంటీలను అమలుచేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఓసీలలోని పేదలకు కూడా సంక్షేమ ఫలాలు అంది స్తున్నట్లు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకా లు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తు న్నాయన్నారు. రాష్ట్రంలో అమలవు తున్న 200యూనిట్ల ఉచిత విద్యుత్‌, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లని ర్మాణం వేగంగా కొనసాగుతోందని, మొదటి దశలో 35000 ఇళ్లు, రెండో దశలో మరో 2000ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వేములవాడ, చందుర్తి, కోరుట్ల రహదారి విస్తరణతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి భారీ నిధులు మంజూర య్యా యని, చందుర్తి మండల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో పలువురి చేరిక

చందుర్తి మండలంలోని దేవుని తండాకు చెందిన పలువురు బిజెపి, టిఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారిని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ ముస్కు ముకుందరెడ్డి, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గొట్టె ప్రభాకర్‌, నాయకులు నాగం కుమార్‌, చింతపంటి రామస్వామి, పులి సత్తయ్య, ధర్మపురి శ్రీనివాస్‌, బాణాల రవిందర్‌ రెడ్డి,నాగుల శంకర్‌, గసికంటి ప్రభాకర్‌, దూది శీనివాసరెడ్డి, మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 12:06 AM