Share News

కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం

ABN , Publish Date - Mar 19 , 2026 | 11:28 PM

జిల్లాలో తెలుగు పరాభవనామ సంవత్సరం (ఉగాది) పర్వది నాన్ని ప్రజలు గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం
అచ్చంపేట : భక్తమార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు

కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం

అచ్చంపేట/ టౌన్‌/ ఉప్పునుంతల/ కల్వకుర్తి/ కొల్లాపూర్‌/ వంగూరు/ మన్ననూర్‌/ చారకొండ/ ఊర్కొండ/ కోడేరు/ పెద్దకొత్తపల్లి/ బిజినేపల్లి/ తిమ్మాజిపేట/ తాడూరు/ పెంట్ల వెల్లి/ తెలకపల్లి/ అమ్రాబాద్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో తెలుగు పరాభవనామ సంవత్సరం (ఉగాది) పర్వది నాన్ని ప్రజలు గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కొత్త సంవత్సరంలో అన్నీ మంచి జరగాలని కొంగొత్త ఆశలతో ప్రజ లు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆరుగాలం వెన్నంటే ఉండే పశువులను శుభ్రపరిచి ముస్తాబు చేశారు. వ్యవసాయ పనిముట్లను సైతం శుభ్రపరిచి రైతులు కొత్త సంవత్సర వ్యవ సాయానికి శ్రీకారం చుట్టారు. రైతులు గుంటుకలు తోలారు. గ్రామాలు, పట్టణాల్లో ఉగాది పర్వదినం సందర్భంగా ఆల యాల్లో పురోహితులు పంచాం గాన్ని చదివి ప్రజలకు వినిపించారు. ఊరు, పట్టణం ఎలా ఉండబోతుంది, భవిష్య త్తులో కాలం ఎలా అవుతుంది తదితర అంశాలను పురోహి తులు ప్రజలకు వివరించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పం టలు బాగా పండాలని ఆకాంక్షించారు.

Updated Date - Mar 19 , 2026 | 11:28 PM