వారాంతపు సెలవులు ఇవ్వాలి
ABN , Publish Date - Aug 20 , 2026 | 11:17 PM
కార్మికులకు వారం తపు, నెలసరి, క్యాజువల్ సెలవులను పక డ్బందీగా అమలు చేయాలని ఏఐటీయూ సీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివ శంకర్ అన్నారు.
- ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్
కందనూలు/ అచ్చంపేటటౌన్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : కార్మికులకు వారం తపు, నెలసరి, క్యాజువల్ సెలవులను పక డ్బందీగా అమలు చేయాలని ఏఐటీయూ సీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివ శంకర్ అన్నారు. ఏఐటీయూసీ నాయకులు మునిసిపల్ కార్యాలయంలో మునిసిపల్ కమిషనర్ మురళిని కలిసి సీడీఎంఏ ద్వారా వచ్చిన సర్క్యులర్ అందజేశారు. ఆయన మా ట్లాడుతూ నగరాన్ని శుభ్రం చేసే కార్మికులు బాగుంటేనే నగరం బాగుంటుందన్నారు. ముని సిపాలిటీ పరిధిలో పని చేసే కార్మికులకు సమ స్యలపై ఆయనతో మాట్లాడామన్నారు. ఈ కార్య క్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్య దర్శి నరసింహ, సభ్యులు తిరుపతమ్మ, బషీర్ పాల్గొన్నారు.
మునిసిపల్ కమిషనర్‌కు వినతి
కందనూలు, (ఆంధ్రజ్యోతి) : మునిసిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు సెలవు లు, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం అమలు చేయా లని ఏఐటీయూసీ నాయకులు కోరారు. సీడీఎం ఏ ద్వారా వచ్చిన సర్క్యులర్ ప్రకారం కార్మికు లకు వసతి, సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ మునిసిపల్ కమిషనర్ నాగిరెడ్డికి గురువారం ఏఐటీయూసీ నాయకులు వినతిపత్రం అందజే శారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ మాట్లాడుతూ పట్టణాలను పరిశుభ్రంగా ఉంచే కార్మికుల సంక్షేమం చూసి నప్పుడే నగరాలు బాగుంటాయ న్నారు. వాటి అమలుకు మునిసిపల్ కమిషనర్ సానుకూ లంగా స్పందించారని వారు తెలిపారు. ఈ కా ర్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్య దర్శి మాడుగుల నరసింహ, పట్టణ నాయకులు వంకేశ్వరం శ్రీనివాసులు, కొత్త రామస్వామి, ఈర్ల హుస్సేన్ పాల్గొన్నారు.