Share News

kumaram bheem asifabad- పత్తి రైతులకు కలుపు కష్టాలు

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:11 PM

మండలంలో నాలుగు రోజుల పాటు కురిసిన ముసురు వర్షాలతో పత్తిలో గడ్డి పెరిగిపోయింది. ప్రస్తుతం మండలంలో ఎటూ చూసినా పత్తి పంట కనిపిస్తోంది. కానీ పత్తి చేనులో పత్తి తో పాటు గడ్డి మొలకెత్తడంతో రైతు లు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రస్తుతం ఆకాశం మబ్బులుగా ఉండడంతో కలుపు తీత పనులు సాగడం లేదు. పత్తి పంటలో రోజు రోజుకు గడ్డి పెరుగుతుండగా, వర్షాల కారణంగా కూలీలు కూడా దొరకని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు

kumaram bheem asifabad- పత్తి రైతులకు కలుపు కష్టాలు
చింతలమానేపల్లిలో సాగు చేస్తున్న పత్తి

చింతలమానేపల్లి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): మండలంలో నాలుగు రోజుల పాటు కురిసిన ముసురు వర్షాలతో పత్తిలో గడ్డి పెరిగిపోయింది. ప్రస్తుతం మండలంలో ఎటూ చూసినా పత్తి పంట కనిపిస్తోంది. కానీ పత్తి చేనులో పత్తి తో పాటు గడ్డి మొలకెత్తడంతో రైతు లు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రస్తుతం ఆకాశం మబ్బులుగా ఉండడంతో కలుపు తీత పనులు సాగడం లేదు. పత్తి పంటలో రోజు రోజుకు గడ్డి పెరుగుతుండగా, వర్షాల కారణంగా కూలీలు కూడా దొరకని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. మండలంలోని రైతులు ప్రధానంగా పత్తి పంట సాగు చేస్తుంటారు. పత్తితో పాటు కంది, సోయా, మొక్క జొన్న పంటలు సాగు చేస్తున్నారు. పత్తితో పాటు కంది, సోయా, మొక్క జొన్న పంటలు సాగు చేస్తున్నారు. మండలంలోని 32 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఇప్పటికే రైతులు ఎకరానికి రైతులు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. పత్తి చేలల్లో కలుపు విపరీతంగా పెరుగుతుండడంతో పత్తి మొక్కలు ఎదగడం లేదు. ఎకరానికి పది మందికిపైగా కూలీలు అవసరం అవుతుండగా, కూలీలకు రోజుకు రూ.300 చొప్పున చెల్లిస్తున్నారు. ఎకరానికి రూపాయిలు నాలుగు వేల నుంచి ఐదు వేల ఎకరాల వరకు అదనంగా ఖర్చు అవుతుంది. ఇటీవల కురిసిన వర్షాలతో పత్తిలో కలుపు పెరుగడంతో పాటు తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఏవో కార్తిషాను వివరణ కోరగా రైతులు పంటలను కాపాడు కునేందుకు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. గడ్డి మందు లు కొట్ట్టకుండా కలుపు తీసివేయాలని చెప్పారు. గడ్డి మందులు పిచికారి చేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పంటల సాగులో సమస్యలుంటే ఏఈవోలను సంప్రదిం చాలని సూచించారు.

Updated Date - Jul 28 , 2026 | 11:11 PM