Share News

kumaram bheem asifabad- అర చేతిలో వాతావరణ సమాచారం

ABN , Publish Date - May 19 , 2026 | 10:27 PM

పిడుగులు, వర్షాలు ప్రధానంగా రైతులకు తీరని నష్టం కలిగిస్తున్నాయి. వేసవి పూర్తి కాకముందే కురిసే వర్షాలతో పాటు పిడుగుల భయం ఎక్కవగా ఉంటుంది. కానీ నేడు కాలం మారింది. వర్షం ఎప్పుడు ఎక్కడ పడుతుందో, ఉరుములు, మెరుపులు, పిడుగులు ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తాయో తెలిపే పాంకేతిక పరి జ్ఞానం దరి చేరింది.

kumaram bheem asifabad- అర చేతిలో వాతావరణ సమాచారం
లోగో

- ముప్పును ముందే చెబుతాయి

- ఏటా పిడుగులతో రైతులు, పశువుల మృత్యువాత

వాంకిడి, మే 19 (ఆంధ్రజ్యోతి): పిడుగులు, వర్షాలు ప్రధానంగా రైతులకు తీరని నష్టం కలిగిస్తున్నాయి. వేసవి పూర్తి కాకముందే కురిసే వర్షాలతో పాటు పిడుగుల భయం ఎక్కవగా ఉంటుంది. కానీ నేడు కాలం మారింది. వర్షం ఎప్పుడు ఎక్కడ పడుతుందో, ఉరుములు, మెరుపులు, పిడుగులు ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తాయో తెలిపే పాంకేతిక పరి జ్ఞానం దరి చేరింది. వాతావరణంలోని మార్ప లను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందిం చింది. దీని సాయంతో రక్షించుకోవడానికి ప్రజలకు ఎంతో సులువవుతుంది. పిడుగులు, వర్షాల వల్ల మనుషులు, మూగజీవాలు మరణి ంచిన సంఘటణలు అనేకంగా ఉన్నాయి. వాతావరణ పరిస్థితులను తెలిపే యాప్‌లపై అవగాహన లేక ప్రజలు నష్టాలను చవిచూడా ల్సి వస్తుంది.

- దామిని యాప్‌..

ఎప్పటికప్పుడు మెరుపు హెచ్చరికలను తెలి యచేసేందుకు దామిని యాప్‌ ఉపయోగపడు తుంది. మెరుపు ఎందుకు వస్తుంది, మెరుపు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ యాప్‌లో సవివరంగా వివరించారు. లోకేషన్‌ ఆధారంగా ఎక్కడెక్కడ మెరుపులు వచ్చే అవకాశముందో సూచిస్తుంది. పిడుగు పడిన ప్పుడు తోటి వారికి అందించాల్సిన వైద్య సహాయం, శ్వాస ఆగిపోతే నోటి నుంచి శ్వాసను పునరుజ్జీవనం చేయడం, గుండె చప్పుడు ఆగిపోతే సీపీఆర్‌ చేయడం తదితర వివరాలతో పాటు పిడుగు పడినప్పుడు ప్రాథమికంగా చేయకూడని, చేయాల్సిన పనులను ఇందులో పేర్కొనడంతో వివిధ వర్గాల వారికి ఈ యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.దీన్ని గుగుల్‌ ప్టేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇది సమీపంలోని 20 కిలోమీటర్ల దూరంలో 5 నుంచి 20 నిమిషాల్లో ఎక్కడ పిడుగు పడుతుందో అప్రమత్తం చేస్తుంది. దీని వల్ల సురక్షిత ప్రాంతాలక వెళ్లోచ్చు.

- వర్ష సూచన..

ఎప్పటికప్పుడు వర్ష సూచనను ఈ యాప్‌ మీకు అందుబాటులోకి తెస్తుంది. మీరు నివసిస్తున్న ప్రాంతంలో వాతావరణ, వర్ష సూచనలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడె క్కడ ఏ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయో తెలియజేస్తుంది. వాతావరణంలోని ఉష్ణోగ్రత, మేఘావృతం తదితర అంశాలను వివరిస్తుంది. ప్లేస్టోర్‌లో రెయిన్‌ అలారం అని ఇంగ్లీష్‌లో టైప్‌ చేస్తే ఈ యాప్‌ కనిపిస్తుంది. కేవల ఒక నిమిషంలో డౌన్‌లోడ్‌ అవుతుంది. వినియోగదా రుడు అందించిన వివరాల మేరకు అతను ఉన్న ప్రాంతానికి సమీపంలో 20 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ వర్షం పడే సూచనలున్నా యో సమగ్ర సమాచారం క్షణాల్లో అందిస్తుంది. దీంతో వర్షం ముప్పు తెలుసుకోని ముందే జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.

- సమగ్ర వివరాలతో..

పంట చేన్లకు ఎరువులు అందించాల్సిన సమ యంలో లేదా వరి కోతల సందర్భాల్లో రైతులకు నష్టం చేసేవి వర్షాలే. దాన్ని తప్పించుకునేందుకు భారత వాతావరణశాఖ మెఘాదూత్‌ యాప్‌ను రూపకల్సిన చేసింది. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుంటే తాజా సమాచారాన్ని అందిస్తుంది. రాబోయే 5 రోజుల్లో వాతావరణ మార్పులు, వర్ష సూచనలు సహా అకాశం మేఘావృతమవు తుందా ? ఈదురుగాలులు ఏ మేరకు ఎక్కడి నుంచి ఎక్డకు ఏ దిశగా వీస్తాయో తెలుపు తుంది. మేఘదూత్‌ యాప్‌లో సమగ్ర సమా చారం అందుబాటులోకి వస్తుంది. వర్షపాతం, గాలిలో తేమ, గాలివేగం, గాలి వీచే దిక్కు, ఉష్ణోగ్రత తదితర అంశాలను ఎప్పటికప్పుడు ఆప్‌డేట్‌ చేస్తుంది.

Updated Date - May 19 , 2026 | 10:27 PM