Share News

యువత చేతిలో అస్త్రం

ABN , Publish Date - Jan 24 , 2026 | 11:09 PM

ఓటు హ క్కు దేశంలో 18 ఏళ్లు నిండిన పౌరులకు భారత రా జ్యాంగం కల్పించిన వజ్రాయుధం. ఆ వయసులో పూ ర్తిస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకొనే అవకాశం ఏ ర్పడుతున్నందున రాజ్యాంగా 18 ఏళ్లకు ఓటు హక్కు క ల్పించే చర్యలు చేపట్టింది.

యువత చేతిలో అస్త్రం

ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు

-ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించుకొనే వజ్రాయుధం

-ఓటు హక్కును మరవొద్దు, బాధ్యతను తాకట్టు పెట్టవద్దు

-నేడు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం

మంచిర్యాల, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ఓటు హ క్కు దేశంలో 18 ఏళ్లు నిండిన పౌరులకు భారత రా జ్యాంగం కల్పించిన వజ్రాయుధం. ఆ వయసులో పూ ర్తిస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకొనే అవకాశం ఏ ర్పడుతున్నందున రాజ్యాంగా 18 ఏళ్లకు ఓటు హక్కు క ల్పించే చర్యలు చేపట్టింది. ఐదేళ్ల మన భవిష్యత్‌ను ని ర్ణయించుకొనే ఏకైక అస్త్రం. ఓటుతో సమర్థవంతుడైన నాయకుడిని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకొనే వెసులుబాటు పౌరులకు ఉంది. అదే ఓటుతో అసమర్థులను ఇంటిదారి పట్టించే హక్కు భారత పౌరులు కలిగి ఉన్నారు. ఓటరు దేశ భవిష్యత్‌ను సైతం నిర్ణయించే హక్కుదారు. ఓటు వేయడంలో నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా పౌరులు అ నామకులను అందలమెక్కించిన వారవుతారు. తాను ఒ క్కడినే ఓటు వేయకపోతే ఏమవుతుందనే అభిప్రా యం కూడా అనర్హులకు ఊతం ఇచ్చినట్లవుతుంది. ఓ టు హక్కును వినియోగించుకోవడం పౌరుల భాధ్యత. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించు కు న్నప్పుడే దానికి ఉన్న విలువ సార్థకం అవుతుంది.

ప్రలోభాలకు లొంగవద్దు....

ఎన్నికలంటేనే డబ్బు, మద్యం ఏరులై పారుతున్న రో జులివి. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు ప్రజలను ప్రలో భాలకు గురి చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. నోట్ల కోసం, మద్యం కోసం ఓటు హక్కును దుర్వినియోగం చేసే ఓటర్లూ లేకపోలేదు. ఓటు వేస్తే మాకేంటి అనే ధోరణి కొందరిలో కనిపిస్తుంటుంది. ప్రజలు వేసే ఓటు తమ ప్రాంతాన్ని ఐదేళ్ల వరకు పాలించే నాయకున్ని ఎ న్నుకొనే బ్రహ్మాస్త్రం అనే విషయాన్ని విస్మరించకుండా ని క్కచ్చిగా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే రా జ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కుకు సంపూర్ణ అర్థం వస్తుంది. నాయకుల ప్రలోభాలకు లొంగకుండా సమర్థవంతుడైన నాయకుడిని ఎన్నుకొనే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. భారత దేశంలో ప్రతి సంవత్సరం జ నవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం జరుపుకుం టారు. ఈ యేడు ’’నా భారత్‌- నా ఓటు’’ నినాదంతో ఓట రు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఓటు హక్కు, దాని వినియోగంపై పౌరులకు ప్రతి ఏటా అవగాహన కల్పి స్తారు. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులను ఓట ర్లుగా గుర్తించేందుకు జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఎ న్నికల సంఘం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కొత్త ఓ టర్ల నమోదు, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు విలువ లపై విద్యార్థులకు పోటీలు సైతం నిర్వహిస్తోంది.

జిల్లాలో మొత్తం ఓటర్లు....

ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం ప్రకారం 6-1-2025 నాటికి జిల్లాలో 6,56,181 మంది ఓటర్లు ఉ న్నారు. వీరిలో పురుషులు 3,24,379 మంది ఉండగా స్త్రీలు 3,31,756 మంది ఉన్నారు. వీరితో పాటు ఇతరులు 46 మంది ఉండగా, ఎన్‌ఆర్‌ఐ, సర్వీసు (దేశ భద్రత బలగాలు) ఓటర్లు మరో 683 మంది ఉన్నారు.

ఓటర్లు నియోజక వర్గాల వారీగా ఇలా...

చెన్నూరు నియోజక వర్గం...

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,96,020 మంది ఉండగా పురుషులు 96,964 మంది, స్త్రీలు 99,049, ఇ తరులు నలుగురు ఉన్నారు. వీరితోపాటు నియోజక వ ర్గంలో ఎన్‌ఆర్‌ఐ ఓట్లు పురుషులవి 8 ఉండగా, సర్వీస్‌ ఓటర్లు 141 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 139 మంది, స్త్రీలు 2 ఉన్నారు.

బెల్లంపల్లి నియోజక వర్గం....

నియోజక వర్గంలో మొత్తం ఓటర్లు 1,78,408 మంది ఉండగా పురుషులు 88,109, స్త్రీలు 90,286 మంది, ఇత రులు 13 మంది ఉన్నారు. వీరితోపాటు ఎన్‌ఆర్‌ఐ ఓట ర్లు పురుషులు 2, సర్వీస్‌ ఓటర్లు 178 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 169, స్త్రీలు 9 మంది ఉన్నారు.

మంచిర్యాల నియోజక వర్గం...

నియోజక వర్గంలో మొత్తం ఓటర్లు 2,81,753 మంది ఉండగా పురుషులు 1,39,306 మంది, స్త్రీలు 1,42,421 మంది, ఇతరులు 26 మంది ఉన్నారు. వీరితో పాటు ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 29 మంది ఉండగా పురుషులు 23 మంది, స్త్రీలు ఆరుగురు ఉన్నారు. అలాగే సర్వీసు ఓటర్లు 364 మంది ఉండగా, వీరిలో పురుషులు 354 మంది, స్త్రీలు 10 మంది ఉన్నారు.

ఓటు హక్కును వినియోగించుకోవాలి....

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

దేశంలో పరిపాలన ప్రజా స్వామ్య పద్ధతిలో ఉం టుంది. ప్రజలే పాలకులను ఎంపిక చేసుకోవాల్సి ఉం టుంది. దానికి ఓటింగ్‌ కీలక ప్రక్రియ. ఓటింగ్‌ హక్కు కేవలం 18 ఏళ్లు నిండగానే రాదు. ఓటరుగా నమోదు చేసుకున్పప్పుడే ఓటు హక్కు వస్తుంది. 17 ఏళ్ల వయ స్సు దాటిన యువతీ, యువకులు ఫాం 8 ద్వారా ఓట రు నమోదు చేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఓటరు న మోదు ప్రక్రియ ఉంటుంది. యువత దాన్ని సద్వినియో గం చేసుకోవాలి. యువతపై దేశ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారు ఓటరు నమోదు చేసుకోవాలి. అలాగే ఎన్నికల ముందు ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో...లేదో పరిశీలించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకోని వారికి పాలకులను ప్రశ్నించే హక్కు కూడా ఉండదు.

Updated Date - Jan 24 , 2026 | 11:09 PM