Share News

మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:08 PM

తనపై నమ్మకంతో గెలిపించినందుకు అనుక్షణ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని లక్షెట్టిపేట మున్సిపల్‌ చైర్మన్‌ దొంత అంజలి అన్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సభ్యులు, చైర్మన్‌ దొంత అంజలితో పా టు వైస్‌ చైర్మన్‌ మోత్కూరి రాజేశ్వరి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గురువారం బాధ్యతలు చేపట్టారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా
బాధ్యతలు చేపట్టిన అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ దంపతులు

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంత అంజలి

పాలకవర్గ సభ్యుల బాధ్యతల స్వీకరణ

లక్షెట్టిపేట, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): తనపై నమ్మకంతో గెలిపించినందుకు అనుక్షణ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని లక్షెట్టిపేట మున్సిపల్‌ చైర్మన్‌ దొంత అంజలి అన్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సభ్యులు, చైర్మన్‌ దొంత అంజలితో పా టు వైస్‌ చైర్మన్‌ మోత్కూరి రాజేశ్వరి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గురువారం బాధ్యతలు చేపట్టారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లతో పా టు పాలకవర్గ సభ్యులను కమిషనర్‌ విజయ్‌కుమార్‌, మున్సిపల్‌ మేనే జర్‌ కల్లెడ రాజశేఖర్‌తో పాటు పట్టణ ప్రముఖులు రాజకీయ నాయకులు ఘనంగా శా లువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ అంజలి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉంటూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మున్సిపాలిటీలో ఎక్కడ ఏలాంటి సమస్య ఉన్న వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సమస్య పరిష్కారం కోసం పాలక వర్గ సభ్యుల సమన్వయంతో సలహా సూచనలు పాటిస్తూ మున్సి పాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 11:09 PM