Share News

kumaram bheem asifabad- గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం

ABN , Publish Date - Mar 28 , 2026 | 10:24 PM

జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్‌ ఇన్‌చార్జి డేవిడ్‌ అన్నారు. అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో శనివారం పంచాయతీ రాజ్‌, విద్యాశాఖ, గ్రంథాలయ శాఖ, మున్సిపల్‌ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలన్నారు. గ్రంథాలయాలకు వచ్చే పాఠకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

kumaram bheem asifabad- గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

ఆసిఫాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్‌ ఇన్‌చార్జి డేవిడ్‌ అన్నారు. అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో శనివారం పంచాయతీ రాజ్‌, విద్యాశాఖ, గ్రంథాలయ శాఖ, మున్సిపల్‌ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలన్నారు. గ్రంథాలయాలకు వచ్చే పాఠకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గ్రంథాలయాల్లో ఫ్యాన్లు, తాగునీరు, కుర్చీలు, టేబుళ్లు, టాయిలెట్‌, ఫ్యాన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి దృష్ట్యా చల్లని తాగనీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. చరిత్రకు సంబంధించిన గ్రంథాలయ సర్వస్వము ఈ విజ్ఞాన సూచిక, ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌, కురుక్షేత్ర, యోజన, కస్టమర్‌ ఆవాజ్‌, పునాధి వంటి తెలు గు, ఇంగ్లీష్‌ మ్యాగ్‌జైన్లు ఉండాలన్నారు. పోటీ పరీక్షలకు హాజ రయ్యే అభ్యర్థులకు సరిపడ మెటీరీయల్స్‌ను అందుబాటులో ఉంచాలని అన్నారు. గ్రంథా లయాల అభివృద్ధికి పంచాయతీలు, మున్సిపల్‌ శాఖ, గ్రంథాలయ సెస్సులు చెల్లించాల న్నారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరం వార్షిక పద్దును ఆమోదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సరిత, పంచాయతీ అధికారి భిక్షపతి, లైబ్రెరి యన్‌లు సదానందం, ప్రవీణ, విద్యాశాఖ, మున్సిపల్‌ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2026 | 10:24 PM