kumaram bheem asifabad- ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ పకడ్బందీగా చేపడుతాం
ABN , Publish Date - Jun 04 , 2026 | 10:43 PM
జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పకడ్బందీగా చేపడతామని కలెక్టర్ కె హరిత అన్నారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని వీసీ హాల్ నుంచి ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి హాజరయ్యారు.
ఆసిపాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పకడ్బందీగా చేపడతామని కలెక్టర్ కె హరిత అన్నారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని వీసీ హాల్ నుంచి ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జిల్లా ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బంధీగా చేపట్టాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులకు ఈ నెల 15 నుంచి 24 వరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. బూత్ స్థాయి అధికారులు తమ పరిధిలోని ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారం అందించి ధ్రువపత్రాలు జత చేసిన ఫారాన్ని తిరిగి తీసుకుని బీఎల్‌వో యాప్‌లో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నామని తెలిపారు. రాజకీయ పార్టీల తరపున బూత్ స్థాయి ఏజెంట్ల జాబితాను తీసుకుంటామని తెలిపారు. సిర్పూర్ నియోజక వర్గంలో 320 పోలింగ్ కేంద్రాలు, ఆసిఫాబాద్‌లో 358 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఈ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో చేపట్టి ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు జమీల్, నాయబ్ తహసీల్దార్ శ్యాంలాల్, రాంలాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరా మహిళా శక్తి భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి
జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న జిల్లా మహిళా సమాఖ్య ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో రూ.6 కోట్ల అంచనాతో నిర్మిస్తున్న జిల్లా మహిళా సమాఖ్య ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, పంచాయతీ రాజ్ ఇంజనీర్ ధర్మేందర్‌లతో కలిసి సందర్శించి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ ఉన్నారు.