ఆడపడుచులకు అండగా ఉంటాం
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:37 PM
ఆడపడుచులకు ఎల్లవేళలా అండగా ఉంటామని డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి మైదానంలో, నస్పూర్‌కాలనీలోని ప్రాణహిత మైదానంలో అన్ని వార్డులకు చెందిన మహిళలకు శుక్రవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
- డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
శ్రీరాంపూర్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : ఆడపడుచులకు ఎల్లవేళలా అండగా ఉంటామని డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి మైదానంలో, నస్పూర్‌కాలనీలోని ప్రాణహిత మైదానంలో అన్ని వార్డులకు చెందిన మహిళలకు శుక్రవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారి ప్రతిసారి దసరా పండుగ సందర్భంగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందిస్తున్నా మని, ఆ సమయానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ఆరోగ్యం బాగా లేనందున ఇవ్వలేకపోయామన్నారు. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, అందుకే సంక్రాంతిని పురస్కరించుకొని చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతరం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ నాయకు లు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.