Share News

kumaram bheem asifabad- ఆదివాసీలకు అండగా ఉంటాం

ABN , Publish Date - Nov 28 , 2026 | 10:58 PM

ఆదివాసీల సంక్షేమానికి హక్కుల పరిరక్షణకు ఎర్రజెండా అండగా ఉంటుందని ఆదివాసీ అధికార రాష్ర్టీయ యువమంచ్‌ జాతీయ వైస్‌ చైర్మన్‌, మాజీ ఎంపీ బృందా కారత్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షభూమిలో శనివారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలకు ఆమె ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. అంతకు ముందు లుంబిని దీక్షభూమి నుంచి పట్టణంలోని ప్రధాన వీదుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు.

kumaram bheem asifabad- ఆదివాసీలకు అండగా ఉంటాం
బహిరంగసభలో అభివాదం చేస్తున్న మాజీ ఎంపీ బృందా కారత్‌

-మాజీ ఎంపీ బృందా కారత్‌

ఆసిఫాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల సంక్షేమానికి హక్కుల పరిరక్షణకు ఎర్రజెండా అండగా ఉంటుందని ఆదివాసీ అధికార రాష్ర్టీయ యువమంచ్‌ జాతీయ వైస్‌ చైర్మన్‌, మాజీ ఎంపీ బృందా కారత్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షభూమిలో శనివారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలకు ఆమె ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. అంతకు ముందు లుంబిని దీక్షభూమి నుంచి పట్టణంలోని ప్రధాన వీదుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. కుమరంభీం చౌక్‌లోని కుమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. ఆదివాసీలు తమ హక్కుల సాధనకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నాయన్నారు. పులుల సంరక్షణ పేరుతో అడవుల నుంచి ఆదివాసీలను వెళ్లగొట్టేందుకు కుట్రపన్నుతున్నాయని చెప్పారు. జిల్లాలోని కొలాం గొంది గ్రామాన్ని పులుల పేరుతో ఖాళీ చేయించారని గుర్తు చేశారు. వారికి కనీసం పునారవాసం, నష్టపరిహరం చెల్లించలేదన్నారు. జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలను సందర్శించానని అక్కడి పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. విద్యహక్కు చట్టం ఎక్కడ అమలు కావడంలేదని చెప్పారు. ప్రదాని మోదీ వికసిత్‌ భారత్‌ అంటూ చెబుతున్నారని అన్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదని చెప్పారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంతో ఆదివాసీ హక్కుల సాధన సాధ్యమవుతుందని చెప్పారు. ఆదివాసీలు అంత తమకు మద్దతు తెలుపాల్సిన సమయం అసన్నమైందన్నారు. ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కునేందుకు జెన్‌-జీ తరహలో ఉద్యమానికి ఆదివాసీ యువత సిద్ధం కావాలన్నారు. టీఏజీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మీడియం బాపురావు, ప్రదాన కార్యదర్శి పూసం సచిన్‌ మాట్లాడుతూ ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టే కుట్ర జరుగుతుందన్నారు. పెసా చట్టంతో ఆదివాసీలు తమ గ్రామాల్లో జరిగే అభివృద్ధిని తామే నిర్ణయించుకోవలని ఉంటుందన్నారు. ఆదివాసీ చట్టాలను తుంగలో తొక్కుతున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. కుమరంభీం, బీర్షా ముండా పోరాట స్ఫూర్తితో ఆదివాసీలు ఉద్యమానికి సిద్ధం కావాలని తెలిపారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, సీపీఎం, సీపీఎం అనుబంధ సంఘాల నాయకులు రవికుమార్‌, రమేష్‌, రాములు, స్కైలబ్‌బాబు, సోమయ్య, భూపాల్‌, రవిందర్‌, ఆశయ్య, త్రివేణి, రమేష్‌, నాగరాజు, ఇందురావు, దినకర్‌, రాజన్న, కార్తీక్‌, రాజేందర్‌, కృష్ణామాచారి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2026 | 10:58 PM