ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు వెన్నంటే ఉంటాం
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:38 PM
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు.
- ఎంపీ డాక్టర్ మల్లు రవి
మన్ననూర్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు. అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఉ ద్యోగులు ఆదివారం ఎంపీ డాక్టర్ మల్లురవి, ఎ మ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణలని కలిసి సన్మానించా రు. 32 రోజుల పాటు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న క్రమంలో తమకు అండగా నిలిచి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన ఎంపీ డాక్టర్ మల్లు రవి కి వారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాల చెల్లిం పుతో పాటుగా 100శాతం గ్రాస్ శాలరీ అమలు కు సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయించి ప్రభుత్వ హామీలు అమలయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలకృష్ణ, ప్రధాన కార్య దర్శి కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌస్ పాషా, సభ్యులు కల్పన, ప్రవీణ్, రేణయ్య, హైమావతి, పద్మ పాల్గొన్నారు.
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
అచ్చంపేట, (ఆంధ్ర జ్యోతి) : ఈ నెల 26న మద్దిమడుగులో సంత్ సేవాలాల్ విగ్రహ ప్రతి ష్ఠాపనకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నం దున ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఎంపీ డాక్టర్ మల్లు రవితో కలిసి ఆదివారం అచ్చంపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఎమ్మె ల్యే మాట్లాడారు. ఈ నెల 26న సాయంత్రం 3 గంటలకు మద్దిమడుగులో రూ. 38కోట్లతో సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్ర హం ఏర్పాటు కోసం భూమి చేస్తారని తెలిపా రు. మద్దిమడుగు ఆలయ అభివృద్ధికి రూ.25 కో ట్లు, రహదారి వెడల్పు కోసం రూ.55 కోట్లు మం జూరయ్యాయని, ఆ పనులకు సీఎం శంకు స్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం అచ్చంపేటలోని వైజంక్షన్‌లో సా యంత్రం 5 గంటలకు బహిరంగ సభలో సీఎం ప్రసంగించి నల్లమల అభివృద్ధికి తీసుకోబోయే చర్యలు ప్రకటిస్తారన్నారు. ముఖ్యంగా ఉమా మమేశ్వర లిఫ్టు ఇరిగేషన్ ద్వారా ఆరు మండలా లకు సాగునీటి ప్రాజెక్టు విషయమై ప్రకటన చేస్తారని, అచ్చంపేటలో ఎడ్యుకేషనల్ హబ్, టూరిజం హబ్‌కు తీసుకోబోయే విషయాలను ప్రకటిస్తారని తెలిపారు. ఇదివరకే సీఎం 0.1 టీఎంసీ నీటిని అచ్చంపేటకు కేటాయించినం దుకు ఈ ప్రాంత ప్రజల తరఫున సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.