Share News

kumaram bheem asifabad- కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

ABN , Publish Date - May 25 , 2026 | 10:20 PM

సింగరేణి కార్మికుల సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని జీఎం విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్ట్రక్చర్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు అన్నీ విధాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఏఐటీయూసీ బ్రాంచ్‌ సెక్రటరీ ఎస్‌ తిరుపతి మాట్లాడుతూ కార్మిక వాడల్లో తాగునీటి పైపులైన్ల ఆఽధునీకరణ, కార్మికులకు క్వార్టర్ల కేటాయింపు, ప్రమోషన్ల మంజూరు, బొగ్గు రవాణాలో భధ్రత, కమ్యూనిటీ హాల్‌ మౌలిక వసతులు, పారిశుద్యం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అలాగే పలు సమస్యలను జీఎం దృష్టికి తీసుకవచ్చారు.

kumaram bheem asifabad- కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
మాట్లాడుతున్న జీఎం విజయభాస్కర్‌రెడ్డి

రెబ్బెన, మే 25 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికుల సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని జీఎం విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్ట్రక్చర్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు అన్నీ విధాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఏఐటీయూసీ బ్రాంచ్‌ సెక్రటరీ ఎస్‌ తిరుపతి మాట్లాడుతూ కార్మిక వాడల్లో తాగునీటి పైపులైన్ల ఆఽధునీకరణ, కార్మికులకు క్వార్టర్ల కేటాయింపు, ప్రమోషన్ల మంజూరు, బొగ్గు రవాణాలో భధ్రత, కమ్యూనిటీ హాల్‌ మౌలిక వసతులు, పారిశుద్యం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అలాగే పలు సమస్యలను జీఎం దృష్టికి తీసుకవచ్చారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు అధికారి మచ్చగిరి నరేందర్‌, స్ట్రక్చర్‌ కమిటీ సభ్యులు శేషశైనారావు, జూపాక రాజేష్‌, బి.జగ్గయ్య, ఎస్‌.ఆనంద్‌, మారం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జీఎం విజయ భాస్కర్‌ రెడ్డి తెలిపారు. సోమవారం గోలేటి జనరల్‌ మేనేజర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల కోసం భీమన్న స్టేడియం ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. వేడుకలకు ఏర్పాట్లు కూడా పక్కాగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో కైరిగూడ పీఓ మచ్చగిరి నరేందర్‌, ఇంజనీర్‌ మూర్తి, డీవైసీఎంఓ పాండురంగ చారి, డీజీఎం(ఐఈడీ) ఉజ్వల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2026 | 10:20 PM