Share News

చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కరిస్తాం

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:13 PM

జిల్లా కేంద్రంలో చిరు వ్యాపారుల సమస్యలు త్వర గా పరిష్కరిచేందుకు కృషి చేస్తాన ని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.

చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కరిస్తాం
నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న చిరు వ్యాపారులు

- నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలో చిరు వ్యాపారుల సమస్యలు త్వర గా పరిష్కరిచేందుకు కృషి చేస్తాన ని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. శు క్రవారం జిల్లా కేంద్రంలో చిరు వ్యా పారులు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ముప్పై ఏళ్లుగా బాలుర ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎదురుగా అంబే డ్కర్‌ చౌరస్తా వద్ద వ్యాపారం చేసుకుంటున్న తమకు సరైన వసతి లేదని వ్యాపారులు పేర్కొ న్నారు. కార్యక్రమంలో చిరు వ్యాపారుల సం ఘం అధ్యక్షుడు రామయ్య, కార్యదర్శి యాదగిరి, చిరు వ్యాపారులు సాదిక్‌, ఖాజా, రవీంద్రచారి, బంగారయ్య, భాస్కర్‌, నరసింహ, ఆరీఫ్‌, సుధా కర్‌, లక్ష్మయ్య, శశికళ, సుజాత, పద్మ, చంద్రకళ పాల్గొన్నారు.

యువకుడికి ఎమ్మెల్యే పరామర్శ

తాడూరు, (ఆంధ్రజ్యోతి) : మండలంలోని యంగంపల్లి గ్రామానికి చెందిన శివసాయి అనే యువకుడు రెండు నెలల క్రితం రోడ్డు ప్రమా దానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ యువకుడు హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఆ సుపత్రిలో వైద్యం పొంది, స్వగ్రామానికి వచ్చా డు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి శుక్రవారం శివసాయి ఇంటికెళ్లి పరామర్శించా రు. సీఎంరిలీఫ్‌ ఫండ్‌ వచ్చే విధంగా ప్ర యత్ని స్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట పార్టీ మండల అధ్యక్షుడు యారరమేష్‌, జిల్లా యూ త్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొత్తపల్లి వినోద్‌, సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ రాంచంద్రారెడ్డి, గౌరీకు మార్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 11:13 PM