డబుల్‌బెడ్‌రూం ఇండ్ల సమస్యలు పరిష్కరిస్తాం....
ABN , Publish Date - May 10 , 2026 | 11:19 PM
నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లను అంది స్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగ ర్‌రావు అన్నారు. ఆదివారం రాజీవ్‌నగర్ 1వ డివిజన్‌లో నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇండ్లను సందర్శించారు.
అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ
మంచిర్యాల, మే10 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లను అంది స్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగ ర్‌రావు అన్నారు. ఆదివారం రాజీవ్‌నగర్ 1వ డివిజన్‌లో నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇండ్లను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గృహ నిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల అధికారులతో ఇందిరమ్మ ఇండ్లపై, డబుల్‌బెడ్ రూం ఇండ్లపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం నిర్వహించారని మంచిర్యాల నియోజకవర్గంలో అప్పుడు ఉన్న ప్రభుత్వ డబుల్‌బెడ్‌రూం ఇండ్లను నిర్మించారు కాని ఇండ్లకు మంచినీరు, రోడ్డులు, సౌకర్యాలు ఏమి లేవని స్పష్టం చేశారన్నారు. కనీస సౌకర్యాలు కల్పించి అర్హులైనవారికి మూడు నెలల్లో లక్కీడ్రా సిస్టం ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికి డబుల్‌బెడ్‌రూం ఇండ్లను ఇస్తామన్నారు. డబుల్‌బెడ్ రూం ఇండ్లకు అర్హులైన లబ్దిదారుల దగ్గర ఎవరైన డబ్బులు తీసుకుంటే సహించేలేదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధూకర్, డిప్యూటి మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేషన్ అధ్యక్షులు తూముల నరే శ్, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.