Share News

kumaram bheem asifabad- కార్మికులకు పనులు కల్పిస్తాం

ABN , Publish Date - Nov 17 , 2026 | 10:36 PM

మండల కేంద్రంలోని సీఎఫ్‌సీ (కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌)లో కార్మికులకు ఉపాధి పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. మండల కేంద్రంలోని సీఎఫ్‌సీని మంగళవారం ఆయన సందర్శిచారు. ఈ సందర్భంగా సీఎఫ్‌సీలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, వివిధ రకాల యంత్రాలు, వాటి పనితీరు, ప్రస్తుతం అందిస్తున్న సేవలు, స్థానిక ఉత్పత్తి దారులు సెంటర్‌ ద్వారా పొందుతున్న ప్రయోజనాల గురించి అఽధికారులను అడిగి తెలుసుకు న్నారు

kumaram bheem asifabad- కార్మికులకు పనులు కల్పిస్తాం
:సీఎఫ్‌సీలో యంత్రాలను పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో మంద మకరందు

వాంకిడి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) మండల కేంద్రంలోని సీఎఫ్‌సీ (కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌)లో కార్మికులకు ఉపాధి పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. మండల కేంద్రంలోని సీఎఫ్‌సీని మంగళవారం ఆయన సందర్శిచారు. ఈ సందర్భంగా సీఎఫ్‌సీలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, వివిధ రకాల యంత్రాలు, వాటి పనితీరు, ప్రస్తుతం అందిస్తున్న సేవలు, స్థానిక ఉత్పత్తి దారులు సెంటర్‌ ద్వారా పొందుతున్న ప్రయోజనాల గురించి అఽధికారులను అడిగి తెలుసుకు న్నారు. సీఎఫ్‌సీకి ప్రభుత్వం ద్వారా ఎలాంటి ఆర్డర్‌ రాకపోవడంతో పనులు జరుగక సీఎఫ్‌సీ మూత పడిందని స్థానికులు పీవో దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వశాఖల్లో అసరమున్న ఫర్నిచర్‌లకు సంబధించి సీఎఫ్‌సీకు ఆర్డర్‌లు అందిస్తే దీనిపై ఆధారపడిఉన్న కార్మికులకు ఉపాధి అవకాశాలు అందుతాయని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల ద్వారా వివిధ రకాల ఆర్డర్లు అందించి సీఎఫ్‌సీని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఈఈ తానాజీ, ఏపీవో వసంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని అంకుశాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో మల్టీ మార్కెట్‌ కేంద్రం ఏర్పాటుతో రైతులకు ప్రయోజనం కలిగించేలా చర్యలు తీసుకుంటున్నామని ఊట్నూర్‌ ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. మల్టీ మార్కెట్‌ కేంద్రం ప్రతిపాదించిన స్థలాన్ని మంగళవారం పీవో సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రతిపాదిత స్థలం యొక్క అనుకూలత, రవాణా సౌకర్యాలు, సాగునీటి వసతి, విద్యుత్‌ సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించి స్థల విస్తీర్ణం ఇతర సాంకేతిక అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మల్టీ మార్కెట్‌ ఏర్పాటు ద్వారా స్థానిక వ్యాపారులు, రైతులు, గ్రామీణ ప్రాంత ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు మెరుగైన మార్కెటింగ్‌ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఈఈ తానాజీ, ఏపీవో భాస్కర్‌, తహసీల్దార్‌ రీయాజ్‌ఆలీ, ఏఈ నిజాముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 10:36 PM