Share News

kumaram bheem asifabad- అర్హులకు పింఛన్లు అందజేస్తాం

ABN , Publish Date - Nov 16 , 2026 | 10:33 PM

అర్హులైన వారందరికీ పింఛన్‌ అందజే స్తామని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిర్పూరు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో 3,500 చేయూత పించన్లు మంజూరయ్యాయని చెప్పారు. అర్హులైన వారందరికి దశల వారీగా పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.

kumaram bheem asifabad- అర్హులకు పింఛన్లు అందజేస్తాం
మాట్లాడుతున్న ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌

సిర్పూరు(టి), నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): అర్హులైన వారందరికీ పింఛన్‌ అందజే స్తామని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిర్పూరు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో 3,500 చేయూత పించన్లు మంజూరయ్యాయని చెప్పారు. అర్హులైన వారందరికి దశల వారీగా పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల ప్రభుత్వమన్నారు. మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నదని వివరించారు. డ్వాక్రా సంఘాల అభివృద్ది కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నదని చెప్పారు. డ్వాక్రా సంఘాల ఆర్థిక బాటలో కొనసాగేందుకు అవకాశాలున్నట్టు తెలిపారు. సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు మాట్లాడుతూ అర్హులైన వారందరికి పెన్షన్లు అందజేస్తామ న్నారు. సిర్పూరు(టి) మండల కేంద్రంలోని వాగు నుంచి చెక్‌ డ్యాం కాల్వ ద్వారా సిర్పూరు(టి) నాగమ్మ చెరువుకు ప్రత్యేక చర్యలు తీసుకున్న సర్పంచ్‌ ఓడ్డెటి నాగమణి చేసిన కృషిని అభినందించారు. నాగమ్మ చెరువు పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రూ. కోట్లి నిధులు విడుదల చేసేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అనంతరం చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సిర్పూరు(టి) సర్పంచ్‌ ఒడ్డెటి నాగమణి, ఎంపీడీవో కోట ప్రసాద్‌, బీజేపీ పార్టీ మండల అధ్యక్షురాలు లావణ్య, సిర్పూరు(టి) మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు ఛత్రునాయక్‌, సర్పంచ్‌లు రాజు, రాచర్ల రజిని, పారిగాం, టోంకిని సర్పంచ్‌లు, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఒడ్డెటి నానయ్య, ఉప సర్పంచ్‌ దుర్గం ప్రశాంత్‌, కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2026 | 10:33 PM