Share News

kumaram bheem asifabad- అర్హులకు చేయూత పింఛన్లు అందజేస్తాం

ABN , Publish Date - Nov 14 , 2026 | 10:20 PM

అర్హులకు చేయూత పింఛన్లు అందజేస్తామని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ తెలిపారు. మండల కేంద్రంలో శనివారం నూతనంగా మంజూరు చేసిన పింఛన్‌ పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షమానికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్టు వివరించారు. పెన్షన్లు రాని వారు అదైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. తప్పకుండా మంజూరు చేసేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపారు.

kumaram bheem asifabad- అర్హులకు చేయూత పింఛన్లు అందజేస్తాం
అర్హులకు పింఛన్‌ మంజూరు పత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు

దహెగాం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): అర్హులకు చేయూత పింఛన్లు అందజేస్తామని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ తెలిపారు. మండల కేంద్రంలో శనివారం నూతనంగా మంజూరు చేసిన పింఛన్‌ పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షమానికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్టు వివరించారు. పెన్షన్లు రాని వారు అదైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. తప్పకుండా మంజూరు చేసేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపారు. వీటిని అంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు తెలిపారు. వృద్దులు, వితంతులు, దివ్యాంగులకు పెన్షన్ల ద్వారా ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అలాగే దహెగాం మండల అభివృద్ధికి తన వంతు కృషి చేనస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు మాట్లాడుతూ అరు ్హలైన నిరూపేదలకు పెన్షన్‌ మంజూరు పత్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి పెన్షన్‌ అందజేసేందుకు అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారంతా కూడా సద్వినియోగం చేసుకోవాల న్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ ఛైర్మన్‌ తిరుపతి గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడె పోతుగంటి భఋామన్న, సర్పంచ్‌లు రాపర్తి జయలక్ష్మి, ఎంపీడీఓ నసిరుల్లాఖాన్‌, ఎంపీవో శ్రీనివాస్‌, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2026 | 10:20 PM