అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛన్ అందజేస్తాం
ABN , Publish Date - Nov 14 , 2026 | 11:33 PM
నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛన్లు అందజేస్తా మని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేటటౌన్, న వంబరు 14 (ఆంధ్రజ్యో తి) : నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛన్లు అందజేస్తా మని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శ నివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో నూతన పిం ఛన్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. నూతన లబ్ధిదారులందరికీ త్వరలోనే పూర్తి స్థా యిలో నగదు అందుతుందన్నారు. ఈ కార్యక్ర మంలో డీఆర్‌డీఏ పీడీ, మునిసిపల్ కమిషనర్ మురళి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గోపా ల్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలి
వంగూరు, (ఆంధ్రజ్యోతి) : గ్రామంలో ఆధు నిక చికిత్సలతో కంటి పొర వైద్య శిబిరం నిర్వ హించడం అభినందనీయమని శిబిరాన్ని ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని రంగాపూర్‌లో శంకర నేత్రాలయం హైదరాబాద్ వారిచే ఉచిత కంటి పొర వైద్య శిబిరం నిర్వహించగా, ఎమ్మెల్యే ప్రా రంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ క్యామ మల్లయ్య, నిర్వాహకులు జలందర్‌రెడ్డి, మండ ల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రమేష్‌గౌడ్ పాల్గొన్నారు.