వడ్డీలేని రుణాలు సమర్థవంతంగా అందజేస్తాం
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:09 PM
నేడు జిల్లా కేంద్రంలో నాగర్‌కర్నూల్ మునిసి పాలిటీ పరిధిలోని 254మహిళా సంఘాలకు 70,80,324 రూపాయల వడ్డీలేని రుణాల చెక్కును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామో దర రాజనరసింహ స్థానిక ప్రజాప్రతి నిధుల తో కలిసి మహిళా సంఘాలకు అందజేశారని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : నేడు జిల్లా కేంద్రంలో నాగర్‌కర్నూల్ మునిసి పాలిటీ పరిధిలోని 254మహిళా సంఘాలకు 70,80,324 రూపాయల వడ్డీలేని రుణాల చెక్కును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామో దర రాజనరసింహ స్థానిక ప్రజాప్రతి నిధుల తో కలిసి మహిళా సంఘాలకు అందజేశారని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. సోమ వారం హైదరాబాద్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క, రాష్ట్ర వ్య వసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు, అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరల పంపి ణీ, వడ్డీలేని రుణాలపై చర్చించారు. జిల్లా కలెక్ట రేట్ వీడియో సమావేశ మందిరం నుంచి డీఆర్‌డీవో చిన్న ఓబులేష్, అదనపు కలెక్టర్లు దేవసహాయం, సంబంధిత శాఖల అధికారుల తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లా డుతూ జిల్లాలోని మునిసిపాలిటీల్లో మహిళా సంఘాల సభ్యుల ద్వారా పట్టణాల్లోని వార్డుల వారీగా అర్హులైన మహిళలకు అందరికీ చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేం దుకు జిల్లా యంత్రాంగం పటిష్ట ప్రణాళిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎస్సీ స్టడీ సర్కిల్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఉమ్మడి జిల్లా ఎస్సీస్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం నాగ ర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా షెడ్యూల్డ్ కులముల అభి వృద్ధి శాఖ అధికారి ఆధ్వర్యంలో రూపొందించి న అవగాహన వాల్‌పోస్టర్లు, కరపత్రాలను అద నపు కలెక్టర్ దేవసహాయం, జిల్లా షెడ్యూల్డ్ కు లాల అభివృద్ధి శాఖ అధికారి ఉమాపతి, డీఆర్ డీవో పీడీ చిన్న ఓబులేష్‌లతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ డిగ్రీ అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీ అభ్యర్థులు ఈ నెల 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఫిబ్ర వరి 8న నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా 100 మందిని ఎంపిక చేసి గ్రూప్స్, బ్యాకింగ్ ఉద్యోగా లకు శిక్షణనిస్తామని పేర్కొన్నారు.