అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:37 PM
మంచిర్యాల నియోజక వర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని డీసీసీ మాజీ అధ్య క్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేమ్‌సాగర్ రావు అన్నారు. శ్రీరాంపూర్‌లోని 6వ డివిజన్‌కు చెందిన పోలుదాసరి కనకమ్మ(అంధురాలు)కు మంజూరైన ఇం దిరమ్మ ఇల్లు పూర్తికాగా, ఆ ఇంటిని మేయర్ ధర్ని మధుకర్‌తో కలిసి శని వారం ఆమె ప్రారంభించారు.
డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
శ్రీరాంపూర్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల నియోజక వర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని డీసీసీ మాజీ అధ్య క్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేమ్‌సాగర్ రావు అన్నారు. శ్రీరాంపూర్‌లోని 6వ డివిజన్‌కు చెందిన పోలుదాసరి కనకమ్మ(అంధురాలు)కు మంజూరైన ఇం దిరమ్మ ఇల్లు పూర్తికాగా, ఆ ఇంటిని మేయర్ ధర్ని మధుకర్‌తో కలిసి శని వారం ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, పేదల సొంతిం టి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను తప్పక నెరవేరు స్తామన్నారు. పేదలందరికీ ఇళ్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు. అనంతరం లబ్ధిదారు కనకమ్మ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ సురేఖ -ప్రేంసాగర్ రావుకు ధన్యవాదాలు తెలిపి సత్కరించారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు వేల్పుల రవీందర్, బండారి సుధాకర్, పత్తి ప్రకృతి వెం కటేష్, నస్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నూకల రమేష్, డివిజన్ ఇన్‌చార్జి మారు మల్లయ్య, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రావి కిషన్ కుమార్, యూ త్ అధఽ్యక్షుడు పవన్ కుమార్, మహిళా అధ్యక్షురాలు పద్మ, పాల్గొన్నారు.