Share News

గురుకుల పాఠశాలల్లో వసతులు కల్పిస్తాం

ABN , Publish Date - Oct 03 , 2026 | 11:27 PM

సాం ఘిక సాంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థు లకు అవసరమైన వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అ న్నారు.

గురుకుల పాఠశాలల్లో వసతులు కల్పిస్తాం
లింగాల గురుకుల పాఠశాలలో సమస్యలను తెలుసుకుంటున్న కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

- కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

లింగాల, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : సాం ఘిక సాంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థు లకు అవసరమైన వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అ న్నారు. శుక్రవారం సాయంత్రం సమయంలో రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ లింగాల గురుకుల పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అక్కడి నుంచే కలెక్టర్‌తో ఫోన్ల్‌ లో మాట్లాడి సమస్యల గురించి తెలిపారు. మం త్రి ఆదేశాల మేరకు శనివారం లింగాల గురు కుల పాఠశాలను కలెక్టర్‌ సందర్శించి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గురుకుల పాఠశాలలో విద్యార్ధులకు అందుతున్న వసతులు, పారిశుద్ద్య నిర్వహణ, తాగునీరు, టాయి లెట్లు, భవనాల పరిస్థితి తదిత ర మౌలిక సదుపాయాలను కేత్రస్థాయిలో పరిశీలించి, సం బంధింత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గురుకులంలోని టాయిలెట్లకు అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు పాత భవనాలకు పెయింటింగ్‌ వేయించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట తహ సీల్దార్‌ వెంకటేష్‌, సర్పంచ్‌ ఈశ్వరమ్మ, ఎంపీఓ రాములునాయక్‌, ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు, పం చాయతీరాజ్‌ ఏఈ శ్రీనివాసులు ఉన్నారు.

ప్రభుత్వ భూమి పరిశీలన

బల్మూరు, (ఆంధ్రజ్యోతి) : మండంలోని వీ రంరామాజీపల్లి గ్రామంలో దాదాపు 50 ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉండగా, ఆ భూమిని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ శనివారం పరిశీ లించారు. పోడు భూములపై ప్రభుత్వం లక్ష్యం తో పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులతో పాటు స్థానిక అధి కారులు, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఎంపీడీవో రేవతి రెడ్డి, వ్యవ సాయ అఽధికారి నరేష్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 11:27 PM