విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తాం
ABN , Publish Date - Aug 11 , 2026 | 11:31 PM
అచ్చంపేట పట్ట ణంలోని 12వ వార్డులో మంగళ వారం ఎమ్మెల్యే వంశీకృష్ణ మా ర్నింగ్ వాక్‌నిర్వహించారు.
- మార్నింగ్ వాక్‌లో ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : అచ్చంపేట పట్ట ణంలోని 12వ వార్డులో మంగళ వారం ఎమ్మెల్యే వంశీకృష్ణ మా ర్నింగ్ వాక్‌నిర్వహించారు. సాం ఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. వారి విద్యాభ్యాసా లను, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, మౌ లిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యావా తావరణం క ల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటా మని తెలిపారు.
పాలనలో వార్డు సభ్యుల పాత్రకీలకం
బల్మూరు, (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలనలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని అచ్చంపేట ఎ మ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు నిర్వహించిన శిక్షణ కారక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతీ వార్డులోని సమస్యలను గుర్తించి సంబంఽ దిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రేవతిరెడ్డితో పాటు మండల అధ్యక్షు డు రాంప్రసాద్‌గౌడ్, ఇతర శాఖ అఽధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ప్రజా వీరుడు పండుగ సాయన్న
లింగాల, (ఆంధ్రజ్యోతి) : పండుగ సాయన్న అత్యంత ధీరునిగా సాహసవంతుడిగా ఎదిగి చిన్ననాటి నుంచి అన్యాయాలను ఎదిరించి, పే దల పక్షాన నిలబడ్డాడని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. సోమవారం మండ ల కేంద్రంలోని బస్టాండ్ ముందుభాగంలో స్థ లంలో పండుగ సాయన్న విగ్రహ నిర్మాణానికి భూమిపూజ చేశారు. నాలుగు రోజుల క్రితం బస్టాండ్‌లో ఉన్న పండుగ సాయన్న విగ్రహాన్ని ఆర్టీసీఅధికారులు తొలగించిన విషయం తెలి సిందే. ఎమ్మెల్యే విదేశీ పర్యటనలో ఉండడంతో ముదిరాజ్ సంఘం నాయకులు, స్థానిక సర్పం చ్ ఆయన దృష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. సోమవారం విగ్రహానికి భూమిపూజ చేశారు. ముదిరాజ్ సంఘం నాయకులు సత్యం, పెబ్బేటి నిరంజన్, లింగస్వామి, కాంగ్రెస్ నాయకులు నారాయణ గౌడ్, పర్వతాలు, యాట ఆంజనేయులు, గుడి శ్రీనివాసులు, యాదగిరి సలేశ్వరం పాల్గొన్నారు.